Blast At Cracker Manufacturing Unit | బాణసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 11 మంది మృతి
Blast At Cracker Manufacturing Unit | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Blast At Cracker Manufacturing Unit | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దులోని పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. అనేక మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ చాలా మంది కార్మికులు కూడా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కలకలం.. 4 నెలల్లో 200 మందికి పాజిటివ్
వరద జలాలే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026

Pilgrims | స్టేషనరీ ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు భక్తులు దుర్మరణం
సెప్టెంబర్ 2, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



