త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Travel for Women | రాఖీపౌర్ణ‌మి కానుక‌.. మ‌హిళ‌ల‌తోపాటు మరొక‌రికి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

Free Travel for Women | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. రాఖీ పౌర్ణ‌మి (Raksha Bandhan) సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌తో మ‌రొక‌రికి యూపీ ఆర్టీసీ బ‌స్సుల్లో (UPSRTC) ఉచిత ప్ర‌యాణం (Free Travel for Women) క‌ల్పిస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

G

National | Published On Aug 23, 2026, 9.20 am IST

Free Travel for Women | రాఖీపౌర్ణ‌మి కానుక‌.. మ‌హిళ‌ల‌తోపాటు మరొక‌రికి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం
Advertisement

Free Travel for Women | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. రాఖీ పౌర్ణ‌మి (Raksha Bandhan) సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌తో మ‌రొక‌రికి యూపీ ఆర్టీసీ బ‌స్సుల్లో (UPSRTC) ఉచిత ప్ర‌యాణం (Free Travel for Women) క‌ల్పిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 27 రాత్రి నుంచి 28న‌ రాత్రి వ‌ర‌కు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌తోపాటు మ‌రొక‌రు (Companion) కూడా ఉచితంగా బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ర‌వాణా శాఖ‌, పోలీసులు సంయుక్తంగా ప‌నిచేయాల‌ని, మ‌హిళ‌లు క్షేమంగా వారి ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు.

అదేవిధంగా యాంటీ రోమియో స్క్వాడ్ నిరంతరం చురుగ్గా ఉండేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. మద్యం, ఇతర మత్తుపదార్థాలు సేవించిన ఏ డ్రైవర్‌నూ బస్సు నడపడానికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ల వివరాలను పూర్తిగా ప‌రిశీలించాన్నారు. ఆటో రిక్షా, టాక్సీ డ్రైవర్ల వివ‌రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించడంతోపాటు మ‌హిళా ప్రయాణికుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా అద‌న‌పు బ‌స్సులు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు.

కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే 60 ఏండ్లు పైబడిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2026-27 అనుబంధ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో లక్షలాది వృద్ధ మహిళలకు ప్రయాణ వ్యయం తగ్గనుంది.

ఉత్త‌రాఖండ్‌లో కూడా..

ఉత్త‌రాఖండ్ (Uttarakhand) ప్ర‌భుత్వం కూడా రాఖీ పౌర్ణ‌మి రోజున ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించింది. ఈనెల 28, 29 తేదీల్లో ఇది అమ‌లులో ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌సింగ్ ధామీ (Pushkar Singh Dhami) ప్ర‌క‌టించారు. రాఖీ క‌ట్టేందుకు పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు త‌మ పుట్టింటికి వెళ్తార‌ని, అందుకే వారికోసం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement