Niranjan Reddy | వరద జలాలే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | వెలిగొండ ప్రాజెక్టు ద్వారా యథేచ్చగా ఏపీ సీఎం చంద్రబాబు జలచౌర్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోకపోవడం తెలంగాణకు దుర్దినం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా యథేచ్చగా ఏపీ సీఎం చంద్రబాబు జలచౌర్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోకపోవడం తెలంగాణకు దుర్దినం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మొదట్నుంచి సాగునీటి విషయంలో తెలంగాణకు, పాలమూరుకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం కృష్ణా వరద జలాలు మాత్రమే వాడుకొనే నిబంధన ఉన్నపటికీ మోదీ సహకారంతో, తెలంగాణ ప్రభుత్వ బానిస పోకడలు ఆసరాగా చేసుకొని చంద్రబాబు యథేచ్చగా నికర జలాలు దోచుకుపోతున్న రేవంత్ రెడ్డి నోరు మెదకపోవడం తెలంగాణకు దుర్దినం అని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రతి చుక్క ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ వచ్చిన మూడేండ్లలో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా తపన భావితరాల భవిష్యత్తు కోసం సాగిందని.. నేటి కాంగ్రెస్ తపన కేవలం ఆంధ్రా ప్రయోజనాలకు పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెండి పల్లెంలో కృష్ణా జలాలు
కృష్ణా జలాలను వెండి పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అప్పజెప్పిండు. ఉమ్మడి పాలనలో నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై కొట్లాడే స్వరాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులతో కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. నాడు పోతిరెడ్డిపాడును అడ్డుకోని ఈ కాంగ్రెస్ నేతలు, నేడు ఆంధ్రా ప్రభుత్వం మన నీటిని తరలించుకుపోతున్నా నోరెత్తి మాట్లాడటం లేదు. శ్రీశైలంలో 540 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా నీటి తరలింపుకు ఏపీ ప్రభుత్వం పనులు పూర్తి చేసినా.. కాంగ్రెసోళ్లు చప్పుడు చేయడం లేదు. అవగాహనారాహిత్యంతో నిరాధార ఆరోపణలు చేస్తే తాట తీస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



