త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumitra Anand | ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణేది..? : సుమిత్రానంద్

Sumitra Anand | ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని టీజీపీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రానంద్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ గాలిలో దీపంలా మారిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Aug 31, 2026, 4.57 pm IST

Sumitra Anand | ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణేది..? : సుమిత్రానంద్
Advertisement

Sumitra Anand | త్రినేత్ర‌.న్యూస్ : ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని టీజీపీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రానంద్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ గాలిలో దీపంలా మారిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సుమిత్రానంద్ సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ప‌త్రిక‌ల్లోనూ, టీవీల్లోనూ ఇవే వార్తలు క‌నిపిస్తున్నాయి. గురుకుల పాఠ‌శాల‌లో చ‌దివి న‌ర్సుగా ప‌ని చేస్తున్న ఓ యువ‌తిపై అత్యాచారం చేసి హ‌త్య చేశారు. ఖ‌మ్మం జిల్లాలో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేసి భ‌వ‌నంపై నుంచి తోసేశారు. మ‌రో మైన‌ర్‌పై ఎంఐఎం ఎమ్మెల్సీ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. హోం శాఖ త‌న వ‌ద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు కూడా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై రివ్యూ చేయ‌లేదు అని సుమిత్రానంద్ మండిప‌డ్డారు.

మహిళల భద్రత కోసం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వంలో షీటీమ్స్ పని చేయ‌డం లేదు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డం కాదు.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై కూడా హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ స‌మీక్ష చేయాలి. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రభుత్వమేనా..! ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీల‌ను నెరవేర్చేదాక బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది అని సుమిత్రానంద్ తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement