Kavya Kalyanram | ఇట్స్ అఫీషియల్ – బలగం హీరోయిన్‌తో లవ్‌స్టోరీని కన్ఫామ్ చేసిన కీరవాణి కొడుకు
కీరవాణి కొడుకు కాళభైరవ, బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు వేర్వేరుగా పోస్ట్‌లు పెట్టారు. త్వరలోనే కావ్య కళ్యాణ్ రామ్, కాళభైరవ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 31, 2026, 5.03 pm IST
Kavya Kalyanram | బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌తో కీరవాణి కొడుకు కాళభైరవ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ జంట తమ లవ్‌స్టోరీని కన్ఫామ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.
పారుతోన్న సెలయేరు...
ఈ మేరకు కావ్య కళ్యాణ్ రామ్‌తో దిగిన ఫొటోలను కాళభైరవ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "నీతో సమయాన్ని గడపటం అంటే కొండల మీద కూర్చొని పారుతోన్న సేలయేరును చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నీతో కలిసి పనులు చేయడం అంటే ఎప్పటికీ ముగించకూడదని అనిపించే విహారయాత్రలా ఉంటుంది. నీతో మాట్లాడటం అంటే...శీతాకాలం ఉదయం వెచ్చటి కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఓ కొత్త వ్యక్తిలా అనిపించలేదు. ఎన్నో ఏళ్ల పరిచయమున్న తోడులా కనిపించావు. మనమిద్దరం జీవితాంతం కలిసి ఉండబోతున్నామని అందరికి చెప్పడానికి ఉత్సాహంగా ఎదరుచూస్తున్నా" అంటూ కాల భైరవ ఓ పోస్ట్ పెట్టాడు.
అదృష్టవంతురాలిని...
కావ్య కళ్యాణ్ రామ్ కూడా కాళభైరవతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "నా జీవితంలోని అత్యంత సాధారణమైన రోజులను కూడా కాంతులతో నింపావు. అదృష్టవంతురాలిననే భావనను నాలో కలిగించావు" అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి.
తండ్రి బాటలోనే...
తండ్రి బాటలోనే అడుగులు వేసిన కాళభైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. తమ్ముడు శ్రీసింహా హీరోగా నటించిన మత్తు వదలరాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కలర్ ఫొటో, కార్తికేయ 2, మృత్యుంజయ్, మత్తు వదలరా 2తో పాటు పలు సినిమాలకు సంగీతం అందించాడు. దేవర, ఆర్ఆర్ఆర్, జెర్సీతో పాటు పలు సూపర్ హిట్ సినిమాలకు సింగర్‌గా పనిచేశాడు.
బలగం సినిమా
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాతో హీరోయిన్‌గా మారింది. బలగం సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కాళభైరవ సోదరుడు శ్రీసింహా హీరోగా నటించిన ఉస్తాద్‌లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు కాళభైరవ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు చెబుతున్నారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష – పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
సెప్టెంబర్ 3, 2026

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ – నాలుగోసారి కాంబో రిపీట్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



