త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | యూపీ గ్యాంగ్‌స్టర్స్‌ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court | నేరగాళ్ల ముఠాలను అరికట్టేందుకు ఉద్దేశించిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్స్‌, యాంటీ సోషల్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) చట్టం-1986 దుర్వినియోగానికి ఆస్కారం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక వ్యక్తిని ‘గ్యాంగ్‌స్టర్‌’గా ముద్ర వేసి శిక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

P

National | Published On Aug 21, 2026, 5.05 pm IST

Supreme Court | యూపీ గ్యాంగ్‌స్టర్స్‌ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Advertisement

Supreme Court | నేరగాళ్ల ముఠాలను అరికట్టేందుకు ఉద్దేశించిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్స్‌, యాంటీ సోషల్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) చట్టం-1986 దుర్వినియోగానికి ఆస్కారం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక వ్యక్తిని ‘గ్యాంగ్‌స్టర్‌’గా ముద్ర వేసి శిక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా శిక్ష విధించేలా ఉన్న చట్టం నేరాన్ని నిర్దిష్టంగా నిర్వచించనందున ‘మొదటినుంచే చెల్లనిది’ (స్టిల్‌బోర్న్‌)గా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం ఇద్దరు న్యాయవాదులపై ఈ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. హింస, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడం అవసరమే అయినప్పటికీ.. ఆ పేరుతో అమాయక పౌరులపై విచక్షణారహితంగా చర్యలు తీసుకోవడం సమర్థనీయం కాదని తెలిపింది.

చట్టంలో ‘గ్యాంగ్‌’, ‘గ్యాంగ్‌స్టర్‌’కు నిర్వచనాలు ఇచ్చి, గ్యాంగ్‌స్టర్‌గా గుర్తించిన వ్యక్తికి శిక్షను నిర్దేశించారని.. అయితే ఆ చట్టం కింద ప్రత్యేకంగా ఏ నేరం చేసినట్లు నిర్ధారించాల్సిన అవసరం లేకుండా పోయిందని ధర్మాసనం పేర్కొంది. దీనివల్ల శిక్షా చట్టం ఆరంభం నుంచే చట్టపరంగా అసమర్థంగా మారుతుందని తెలిపింది. ఈ చట్టం కింద నిందితులను సుదీర్ఘకాలం విచారణ లేకుండా నిర్బంధించే పరిస్థితి ఏర్పడవచ్చని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది నిరోధక నిర్బంధ చట్టాన్ని పోలి ఉంటుందని, అయితే అలాంటి నిర్బంధానికి రాజ్యాంగం, విధివిధానాల పరంగా పలు రక్షణలు ఉన్నాయని గుర్తుచేసింది. విధానపరమైన స్వల్ప ఉల్లంఘనలకూ నిర్బంధితుడిని విడుదల చేసే అవకాశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకున్నాయని పేర్కొంది. సామాజిక ముప్పును ఎదుర్కొనేందుకు రూపొందించిన శిక్షా చట్టమైనా.. నిందితుడిపై ఏకపక్ష, విచక్షణారహిత చర్యలకు తావివ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హింసను అరికట్టే పేరుతో పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధానాలను అనుసరించడం సమర్థనీయం కాదని పేర్కొంది.

Advertisement
Advertisement