Uttar Pradesh | యూపీలో తుఫాను బీభత్సం.. ఒక్కరోజే 100 మంది మృతి
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్ బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ప్రకృతి ప్రకోపానికి ఒక్కరోజే 100 మంది మరణించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్ బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈదురు గాలులు, భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. ఈ వర్షబీభత్సానికి నిన్న ఒక్కరోజే 100 మంది చనిపోయారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రకృతి ప్రకోపానికి ఒక్క ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో అత్యధికంగా 21 మరణాలు సంభవించాయి. భదోహిలో 18 మంది, మీర్జాపూర్‌లో 15, ఫతేపూర్‌లో 10, ఉన్నావ్ , బదౌన్‌లో ఆరుగురు చొప్పున, ప్రతాప్‌గఢ్, బరేలీలో నలుగురు చొప్పున, సీతాపూర్, రాయ్‌బరేలీ, చందౌలీలో ఇద్దరు చొప్పున మరణించారు. కాన్పూర్ దేహత్, హర్దోయ్, సంభాల్‌లో ఇద్దరు చొప్పున, కౌశంబి, షాజహాన్‌పూర్, సోన్‌భద్ర, లఖింపూర్‌లలో ఒక్కొక్కరు చనిపోయారు.
వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పని చేస్తున్న వారు, వర్షం నుంచి తప్పించుకోవడానికి చెట్ల కింద ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయడం లేదు. మొబైల్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలగడంతో పునరుద్ధరణ, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని కున్వర్ అదనపు కలెక్టర్ వీరేంద్ర కుమార్ మౌర్య చెప్పారు. జిల్లాలోని స్థానిక అధికారులు, పోలీసులు సహాయకచర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
Also Read..
మూడో దశ సర్‌పై ఈసీ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
కాన్వాయ్‌ను తగ్గించండి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశం
సంబంధిత వార్తలు

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026

Pilgrims | స్టేషనరీ ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు భక్తులు దుర్మరణం
సెప్టెంబర్ 2, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి



