SIR Phase 3 | మూడో దశ సర్‌పై ఈసీ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
SIR Phase 3 | దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక ప్రకటన చేసింది. ఈ దశలో తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు వెల్లడించింది.
SIR Phase 3 | దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక ప్రకటన చేసింది. ఈ దశలో తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు వెల్లడించింది. మూడో దశలో సుమారు 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి ధృవీకరించనున్నారు.
తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకూ సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 25 నుంచి జులై 24 వరకూ బూత్‌స్థాయి అధికారులు ఇంటింటినీ సందర్శిస్తారు. జులై 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే జులై 31 నుంచి ఆగస్టు 30 వరకూ సమర్పించేందుకు గడువు ఉంటుంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
అదేవిధంగా ఏపీలో జూన్ 5 నుంచి జూన్ 14 వరకూ సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 15 నుంచి జులై 14 వరకూ బూత్‌స్థాయి అధికారులు ఇంటింటినీ సందర్శిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జులై 21న విడుదల చేస్తారు.
దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జులై 21 నుంచి ఆగస్టు 20 వరకూ సమర్పించేందుకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
మూడో దశలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మిజోరం, నాగాలాండ్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు.. చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ ఉన్నాయి.
Also Read..
ట్యాబ్లెట్‌తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
మిస్ ఇండియాకు టాలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్ - శర్వానంద్ జోడీగా?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి




