IPL | మార్కెటింగ్ శక్తిని చాటిన ఐపీఎల్.. రూ.1వేయి కోట్లు దాటిన జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..
IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్కెటింగ్ వేదికగా తన స్థాయిని నిరూపించింది. WPP మీడియా రూపొందించిన 2025 స్పోర్టింగ్ నేషన్ నివేదిక ప్రకారం జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం రూ. 1వేయి కోట్ల మైలురాయిని దాటింది.
IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్కెటింగ్ వేదికగా తన స్థాయిని నిరూపించింది. WPP మీడియా రూపొందించిన 2025 స్పోర్టింగ్ నేషన్ నివేదిక ప్రకారం జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం రూ. 1వేయి కోట్ల మైలురాయిని దాటింది. ఇది లీగ్‌కు ఉన్న అపార ప్రజాదరణను మాత్రమే కాకుండా, క్రికెట్‌ను ప్రధాన మార్కెటింగ్ వేదికగా భారతీయ కార్పొరేట్ సంస్థలకు పెరుగుతున్న నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. ఫ్రాంచైజీలకు ఈ స్పాన్సర్‌షిప్ ఆదాయం టికెట్ అమ్మకాలు, ప్రసార హక్కులు వంటి సంప్రదాయ ఆదాయ వనరులకు మించి ఆర్థిక స్థిరత్వాన్ని అందించే కీలక ఆధారంగా మారింది.
అనేక బ్రాండ్లు ముందుకు..
ఈ వాణిజ్య విస్తరణకు ప్రధాన కారణాల్లో ఒకటి బ్రాండ్ వర్గాల విభిన్నీకరణ. గతంలో ఫాంటసీ గేమింగ్ కంపెనీలు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, నియంత్రణ మార్పులతో ఇప్పుడు టెక్నాలజీ, విమానయాన, ఫిన్‌టెక్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలు ముందుకు వచ్చాయి. ఈ రంగాలు ఐపీఎల్‌ను దేశంలోని విస్తృత వినియోగదారులను చేరుకునే ప్రధాన ద్వారంగా చూస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్ల పెరుగుతున్న భాగస్వామ్యం ఐపీఎల్‌కు గ్లోబల్ ప్రాధాన్యత పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. చాలా ఒప్పందాల్లో ఇప్పుడు భారత్ వెలుపల కూడా బ్రాండ్ యాక్టివేషన్ హక్కులు చేరుస్తున్నారు.
అగ్ర స్థానంలో ఈ జట్లే..
అయితే ఈ రూ.1వేయి కోట్ల ఆదాయం అన్ని జట్ల మధ్య సమానంగా విభజన జరగలేదు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ మూడు జట్లు ఒక్కొక్కటి సుమారు రూ. 150 కోట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం పొందుతున్నాయి. ఇవే మిగతా జట్లకు ప్రమాణాన్ని నిర్ధేశిస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ రెండో స్థాయిలో నిలిచాయి. మిగతా జట్లు కలిసి మొత్తం స్పాన్సర్‌షిప్ విలువను రూ. 1,033 కోట్లకు చేర్చుతున్నాయి.
WPP మీడియా మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ కార్నిక్ మాట్లాడుతూ ఐపీఎల్ కేవలం పెద్దది మాత్రమే కాదు, భారత క్రీడా వాణిజ్యానికి వెన్నెముకలా మారింది. పెద్ద స్థాయి ప్రేక్షక వర్గం ఉన్నప్పుడు పాత స్పాన్సర్లు గానీ, కొత్త స్పాన్సర్లు గానీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారని ఇది చూపిస్తోందని అన్నారు.
స్ప్రింట్ మోడల్‌గా నిలుస్తున్న ఐపీఎల్..
ప్రపంచంలోని ఇతర ప్రముఖ క్రీడా లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ వాణిజ్య ప్రగతి విశేషంగా నిలుస్తోంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ సంవత్సరానికి 6 బిలియన్ పౌండ్ల ఆదాయం సాధిస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఫుట్‌బాల్ లీగ్‌గా ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్‌కు వచ్చే మీడియా హక్కుల విలువ పరంగా ఐపీఎల్ ఇప్పటికే దాన్ని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత ఐపీఎల్ రెండో స్థానంలో ఉంది. ఫార్ములా వన్, ప్రీమియర్ లీగ్ వంటి క్రీడలు ఏడాది పొడవునా కొనసాగుతుండగా, ఐపీఎల్ మాత్రం కేవలం రెండు నెలల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని సృష్టిస్తుంది. దీని వల్ల యూరప్, అమెరికా లీగ్‌ల మారథాన్ మోడల్‌కు విరుద్ధంగా, ఐపీఎల్ ఒక అధిక వేగంతో నడిచే స్ప్రింట్ మోడల్‌గా నిలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
జులై 2, 2026

Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా శ్రీ చరణి
జూన్ 24, 2026

Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!



