PM Modi | మధ్యప్రాచ్యంలో యుద్ధం భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది : ప్రధాని మోదీ
PM Modi | మధ్యప్రాచ్యంలో (West Asia) యుద్ధం భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు.
PM Modi | మధ్యప్రాచ్యంలో (West Asia) యుద్ధం భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు పూర్తైందన్నారు. ఈ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
వాణిజ్యం దెబ్బతింటోంది..
ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసులో ఆటంకాలు కలగడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో అనేక సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ఈ వార్ మనకూ అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందన్నారు. ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలతో వాణిజ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధనం అత్యంత కీలకమని ప్రధాని అన్నారు. దేశ చమురు, గ్యాస్ అవసరాలను తీర్చడంలో పశ్చిమాసియా ప్రధాన వనరుగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాం..
ఇక ఈ యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించేందుకు, ఇంధన సవాళ్లను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోని భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. హర్మూజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. "ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై పెద్దగా ప్రభావం పడకుండా చూడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సామాన్య గృహాలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం. భారతదేశం తన ఎల్పీజీ (LPG) అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే దిగుమతులపై భారం తగ్గించడానికి దేశంలోనే ఇంధన ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాం" అని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో హర్మూజ్ ముట్టడి, నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదని ప్రధాని వ్యాఖ్యానించారు.
3 లక్షల మంది భారతీయుల్ని తీసుకొచ్చాం..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత పౌరుల భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ విద్యార్థులు సహా 3 లక్షల మందికిపైగా భారతీయుల్ని స్వదేశానికి తరలించినట్లు చెప్పారు. ఇరాన్ నుంచి వెయ్యి మంది భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చినట్లు చెప్పారు. గల్ఫ్ దేశాలతో భారత్‌కు లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. అక్కడ చిక్కుకుపోయిన మన పౌరులకు అక్కడి దౌత్య కార్యాలయాలు సహాయం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. అంతేకాదు, పలు గల్ఫ్ దేశాల నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు. తమ భూభాగాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, క్షేమంపై వారు హామీ ఇచ్చారని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
మార్కెటింగ్ శక్తిని చాటిన ఐపీఎల్.. రూ.1వేయి కోట్లు దాటిన జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..
ట్రంప్ కఠిన వీసా నిబంధనలు.. భారత్, చైనీయులపైనే అధిక ప్రభావం..!
అకస్మాత్తు వర్షాలు, వాతావరణ మార్పులతో ప్రజల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. హెచ్చరించిన WHO..
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!






