PSL | ఫారిన్ ప్లేయర్లకు బెదిరింపులు..! పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై నీలినీడలు..!
PSL | పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభానికి ముందు షాక్ తగిలింది. విదేశీ ఆటగాళ్లుకు బెదిరింపు వస్తుండడంతో టోర్నీపై నీలినీడలు అలుముకున్నాయి. భద్రత, ఇతర ఆందోళనల నేపథ్యంలో పీసీబీ టోర్నీని కొద్ది నగరాలకే పరిమితం చేయడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది.
PSL | పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభానికి ముందు షాక్ తగిలింది. విదేశీ ఆటగాళ్లుకు బెదిరింపు వస్తుండడంతో టోర్నీపై నీలినీడలు అలుముకున్నాయి. భద్రత, ఇతర ఆందోళనల నేపథ్యంలో పీసీబీ టోర్నీని కొద్ది నగరాలకే పరిమితం చేయడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది.
పలు నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ సాయుధ బృందం జమాత్ ఉల్ అహ్రార్ లీగ్‌లో ఎవరూ పాల్గొనవద్దంటూ విదేశీ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ప్రముఖ ప్లేయర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు వస్తే వారి భద్రతకు హామీ ఇవ్వలేమని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థకు చెందిన ఓ కమాండర్ 'ది సండే గార్డియన్'తో మాట్లాడుతూ సంబంధిత క్రికెట్ బోర్డులను వారి ప్లేయర్స్‌ను పాక్‌కు పంపొద్దని కోరారు. ఏదైనా జరిగితే తాము బాధ్యత వహించబోమన్నారు. మ్యాచులు జరుగకుండా, ప్లేయర్స్ మైదానంలోకి వెళ్లకుండా నిరోధించేందుకు తమ శక్తి మేరకు సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పీఎస్ఎల్ పరిమిత నగరాల్లో, ప్రేక్షకులు లేకుండా జరుగుతుందని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ గతంలో ధ్రువీకరించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, పెరుగుతున్న చమురు ధరలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజాగా ఆటగాళ్ల భద్రత పీసీబీకి సవాల్‌గా మారింది. ఆడమ్ జంపా, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే సహా పలువురు విదేశీ ప్లేయర్ ఈ ఏడాది పీఎస్ఎల్ లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టోర్నీలో ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేయర్స్‌తో పాటు బోర్డులు వారి భద్రతను పునః పరిశీలించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం పీఎస్ఎల్ మార్చి 26న ప్రారంభం కావాల్సి ఉంది. పరిస్థితి మెరుగుపడకపోతే, టోర్నీపై ప్రభావం పడే అవకాశం ఉంది. హెచ్చరికల నేపథ్యంలో టోర్నీ నుంచి పలువురు ప్లేయర్లు వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పీసీబీకి భారీగా నష్టం కలిగే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!





