త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | “వార‌ణాసి”కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డ‌బ్బింగ్ – కండీష‌న్ పెట్టిన రాజ‌మౌళి

మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసి సినిమాకు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియాంక చోప్రా తెలుగు డ‌బ్బింగ్ విష‌యంలో రాజ‌మౌళి ఓ కండీష‌న్ పెట్టాడ‌ని అంటున్నారు. ఆ కండీష‌న్ ఏమిటంటే?

N

Entertainment | Published On Nov 21, 2026, 4.30 pm IST

Priyanka Chopra | “వార‌ణాసి”కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డ‌బ్బింగ్ – కండీష‌న్ పెట్టిన రాజ‌మౌళి
Advertisement

Priyanka Chopra | తెలుగు ఆడియెన్స్‌తో పాటు పాన్ ఇండియ‌న్ వైడ్‌గా సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార‌ణాసి ఒక‌టి. మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. దాదాపు ప‌ద‌మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. వార‌ణాసిలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌మౌళి సినిమాతోనే తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతుంది.

షూటింగ్ కంప్లీట్‌...

వార‌ణాసి షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్‌లో డ‌బ్బింగ్ ప‌నుల‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. కాగా వార‌ణాసికి తెలుగులో ప్రియాంక చోప్రా సొంతంగా డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం చాలా రోజుల నుంచి ప్రియాంక తెలుగు నేర్చుకుంటుంది. ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం ప్ర‌త్యేకంగా ఓ ట్రైన‌ర్‌ను నియ‌మించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. రాజ‌మౌళితో పాటు ప్రొడ‌క్ష‌న్ టీమ్ కూడా తెలుగు నేర్చించ‌డంలో ప్రియాంక‌కు ఇన్నాళ్లు సాయం చేసిన‌ట్లు తెలిసింది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ వెర్ష‌న్ల‌లో త‌న పాత్ర‌కు ప్రియాంక‌నే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

జ‌క్క‌న్న కండీష‌న్‌...

సినిమాల టేకింగ్‌, మేకింగ్‌లో రాజ‌మౌళి అస్స‌లు కాంప్ర‌మైజ్ కారు. చిన్న చిన్న విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. అందుకే రాజ‌మౌళిని ఇండ‌స్ట్రీలో జ‌క్క‌న్న అని పిలుస్తుంటారు. ప్రియాంక చోప్రా తెలుగు డ‌బ్బింగ్‌కు సంబంధించి రాజ‌మౌళి ఓ కండీష‌న్ పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా గ్లోబ‌ల్ స్టార్‌ వాయిస్ సెట్ట‌యిత‌నే ఆమె డ‌బ్బింగ్‌ను సినిమాలో ఉంచుతాన‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. లేదంటే మ‌రో డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చేత ఆమె క్యారెక్ట‌ర్‌కు గ‌ళాన్ని అందించాల‌ని రాజ‌మౌళి ఫిక్సైన‌ట్లు చెబుతున్నారు. రాజ‌మౌళి పెట్టిన కండీష‌న్‌కు ప్రియాంక చోప్రా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించే ప‌నిలో ఉన్న‌ద‌ని అంటున్నారు.
ఈ సినిమాలో మందాకిని అనే యాక్ష‌న్ రోల్‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతుంది. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement