Varanasi Movie | “వారణాసి”కి గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి – అప్‌డేట్‌తో పోస్ట్‌పోన్ రూమర్లకు పుల్‌స్టాప్
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న "వారణాసి" పోస్ట్‌పోన్ కానున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. క్రేజీ అప్‌డేట్‌తో ఈ వాయిదా రూమర్లకు మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టారు. "వారణాసి" షూటింగ్ కంప్లీట్ అయ్యిందని అన్నారు. సీజీ, ఆర్ఆర్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.
Entertainment | Published On Nov 16, 2026, 2.51 pm IST
Varanasi Movie | మహేష్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న "వారణాసి"మూవీ వాయిదాపడనున్నట్లు కొన్నాళ్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కానుండటంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పుకార్లకు అప్‌డేట్‌తో మేకర్స్ చెక్ పెట్టారు. వారణాసి షూటింగ్ పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
షూటింగ్ కంప్లీట్...
'"వారణాసి" అప్‌డేట్ కావాలంటూ మహేష్ బాబు అభిమాని పెట్టిన ఓ పోస్ట్‌కు మూవీ టీమ్ రిప్లై ఇచ్చింది. షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో సినిమా ఉంది. సీజీ, ఆర్ఆర్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ స్టార్ట్ చేయాలి' అంటూ తెలిపింది. అంతటితో ఆగకుండా 'ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేట్. ఇంకా బ్లాస్ట్ అప్‌డేట్స్ కావాలంటే కొంత కాలం వెయిట్ చేయాలి' అంటూ వారణాసి టీమ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
కొత్త ఏడాదిన...
"వారణాసి" మూవీకి డిసెంబర్‌లో మహేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. జనవరి 1న ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టైమ్ ట్రావెల్ అడ్వెంచర్...
టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. వారణాసి సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుద్ర అనే ఆర్కియాలజిస్ట్‌గా, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో మహేష్‌బాబు కనిపించబోతున్నారు. మందానికి అనే యాక్షన్ రోల్‌లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.
ఐమాక్స్ ఫార్మెట్
దాదాపు 1500 కోట్ల బడ్జెట్‌తో "వారణాసి"మూవీ రూపొందుతోంది. ఐమాక్స్ ఫార్మెట్‌లో ఈ పాన్ ఇండియన్ మూవీని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా – ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
నవంబర్ 7, 2026

Priyanka Chopra | నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి సీక్వెల్ – ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా
నవంబర్ 7, 2026

Priyanka Chopra | ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ – ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే!
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం
- ●J&K Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం
- ●Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్

Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం



