త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gig Workers Flash Strike | నేడే గిగ్ వ‌ర్క‌ర్ల దేశ‌వ్యాప్త మెరుపు స‌మ్మె.. ప్ర‌భావం ఎలా ఉండబోతుంది..?

Gig Workers Flash Strike | దేశ‌వ్యాప్తంగా ప‌లు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప‌నిచేస్తున్న గిగ్ వ‌ర్క‌ర్లు ఇవాళ దేశ‌వ్యాప్త మెరుపు స‌మ్మె నిర్వ‌హించ‌నున్నారు. నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా ఈ స‌మ్మెను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. డిసెంబ‌ర్ 31వ తేదీ కావ‌డంతో వారు నిర్వ‌హించ‌నున్న మెరుపు స‌మ్మె సాయంత్రం కొన‌సాగ‌నుంది.

S

National | Published On Dec 31, 2025, 7.28 am IST

Gig Workers Flash Strike | నేడే గిగ్ వ‌ర్క‌ర్ల దేశ‌వ్యాప్త మెరుపు స‌మ్మె.. ప్ర‌భావం ఎలా ఉండబోతుంది..?
Advertisement

Gig Workers Flash Strike | దేశ‌వ్యాప్తంగా ప‌లు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప‌నిచేస్తున్న గిగ్ వ‌ర్క‌ర్లు ఇవాళ దేశ‌వ్యాప్త మెరుపు స‌మ్మె నిర్వ‌హించ‌నున్నారు. నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా ఈ స‌మ్మెను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. డిసెంబ‌ర్ 31వ తేదీ కావ‌డంతో వారు నిర్వ‌హించ‌నున్న మెరుపు స‌మ్మె సాయంత్రం కొన‌సాగ‌నుంది. దీంతో ఆయా సంస్థ‌ల‌పై పెద్ద ఎత్తున ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే గిగ్ వ‌ర్క‌ర్ల స‌మ్మె కార‌ణంగా జొమాటో, స్విగ్గీ వంటి సంస్థ‌లు ఇప్ప‌టికే ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టి సారించాయి. రెండు రోజుల్లోనే రూ.6వేలు సంపాదించుకునే గొప్ప అవ‌కాశం అని జొమాటో ఇప్ప‌టికే న‌టి త‌మన్నాతో అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ల‌ను ఇస్తుండ‌గా, స్విగ్గీ కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌నలే చేసింది. న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌తో ఓ ప్ర‌క‌ట‌న చేయించింది. ఈ రెండు రోజుల పాటు స్విగ్గీలో డెలివ‌రీ బాయ్స్‌గా చేస్తే ఏకంగా ఓ ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని న్యూ ఇయర్ మెగా ల‌క్కీ డ్రాలో గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థ‌లు అందిస్తున్న ఈ ఆఫ‌ర్‌ల‌కు నిరుద్యోగ యువ‌త ఎంత మంది స్పందిస్తారో చూడాలి. కానీ ఆయా సంస్థ‌లు ఎంత మందిని నియ‌మించుకున్నా స‌రే పూర్తి స్థాయిలో సేవ‌ల‌ను అందించడం మాత్రం క‌ష్ట‌మే. ఓ వైపు న్యూ ఇయ‌ర్ ఈవ్ సంద‌ర్భంగా భారీ ఎత్తున ఆర్డ‌ర్లు ఉంటాయి. మ‌రోవైపు వ‌ర్క‌ర్ల‌ను అడ్డుకునేందుకు కూడా ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న వ‌ర్క‌ర్లు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా స‌మ్మె ప్ర‌భావం బాగానే ఉండ‌బోతున్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. అయితే గిగ్ వ‌ర్క‌ర్లు మాత్రం త‌మ స‌మ‌స్య‌లు, డిమాండ్లు న్యాయ‌మైన‌వే అని, వెంట‌నే సంస్థ‌లు వాటిని ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

దేశ‌వ్యాప్తంగా ప‌లు ఈ-కామ‌ర్స్ ప్లాట్ ఫామ్‌లు, యాప్‌ల‌లో ప‌నిచేస్తున్న గిగ్ వ‌ర్క‌ర్లు 10 నిమిషాల్లో డెలివ‌రీ అనే విధానం వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఇండియ‌న్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ర్క‌ర్స్ (ఐఎఫ్ఏటీ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ స‌లావుద్దీన్ విచారం వ్య‌క్తం చేశారు. కంపెనీలు వ‌ర్క‌ర్ల‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా 10 నిమిషాల్లో డెలివ‌రీ వంటి విధానాల‌ను అవ‌లంబించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఇందుకు గాను వ‌ర్క‌ర్లు వేగంగా ప్ర‌యాణించి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విధానానికి అన్ని యాప్ లు స్వస్తి ప‌ల‌కాల‌ని అన్నారు. అలాగే వ‌ర్క‌ర్లకు చెల్లించాల్సిన పేమెంట్ల‌లోనూ భారీ కోత విధిస్తున్నార‌ని, ఇందుకు ప‌లు సాకుల‌ను చూపిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గిగ్ వ‌ర్క‌ర్ల‌కు సామాజిక భ‌ద్ర‌త లేద‌ని, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుక‌నే ఈ మెరుపు స‌మ్మె నిర్వ‌హిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement