త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hangover | మ‌ద్యం సేవించాక హ్యాంగోవ‌ర్ రావొద్దంటే.. ఇలా చేయండి..!

Hangover | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చాలా మంది ఇప్ప‌టికే పార్టీ మోడ్‌లోకి ఎంట‌ర్ అయిపోయారు. డిసెంబ‌ర్ 31వ తేదీన రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే రిసార్టులు, ప‌బ్‌లు, క్ల‌బ్‌లు, ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ల‌తో పార్టీ ప‌క్షుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు.

S

Lifestyle | Published On Dec 31, 2025, 10.30 am IST

Hangover | మ‌ద్యం సేవించాక హ్యాంగోవ‌ర్ రావొద్దంటే.. ఇలా చేయండి..!
Advertisement

Hangover | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చాలా మంది ఇప్ప‌టికే పార్టీ మోడ్‌లోకి ఎంట‌ర్ అయిపోయారు. డిసెంబ‌ర్ 31వ తేదీన రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే రిసార్టులు, ప‌బ్‌లు, క్ల‌బ్‌లు, ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ల‌తో పార్టీ ప‌క్షుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. అయితే న్యూ ఇయ‌ర్ పార్టీ అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మ‌ద్యం. చాలా మంది అర్థ‌రాత్రి వ‌ర‌కు పీక‌ల‌దాకా మ‌ద్యం సేవిస్తుంటారు. కానీ అలా మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. మితిమీరిన మోతాదులో మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల విప‌రీత‌మైన దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా మ‌ద్యం అధికంగా సేవిస్తే హ్యాంగోవ‌ర్ వ‌స్తుంద‌ని అంటున్నారు.

హ్యాంగోవ‌ర్ లక్ష‌ణాలు ఇవే..

మ‌ద్యం అధికంగా సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ వ‌స్తే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు సూచ‌న‌లు, ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. హ్యాంగోవ‌ర్ అంటే అస‌లు ఏమిటి.. అని చాలా మంది క‌న్‌ఫ్యూజ్ అవుతారు. కానీ మ‌ద్యం సేవించాక కొన్ని గంట‌ల అనంత‌రం ఆయా ల‌క్ష‌ణాలు, సంకేతాలు క‌నిపిస్తే దాన్ని హ్యాంగోవ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. ఇక హ్యాంగోవ‌ర్ ఉన్న‌వారిలో తీవ్ర‌మైన త‌ల‌నొప్పి ఉంటుంది. విప‌రీత‌మైన అల‌స‌ట, నీర‌సం ఉంటాయి. ప‌నిచేయాల‌నిపించ‌దు. తీవ్ర‌మైన దాహం వేస్తుంది. శ‌రీరంలో ఆల్క‌హాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి క‌నుక మ‌ద్యాన్ని బ‌య‌ట‌కు పంపించేందుకు లివ‌ర్‌కు ఎక్కువ మొత్తంలో నీళ్లు అవ‌స‌రం ఉంటాయి. దీని వ‌ల్ల నీళ్లను అధికంగా తాగాల‌ని శ‌రీరం సూచిస్తుంది. దీంతో దాహం అధికంగా అవుతుంది. ఈ ద‌శ‌లో శ‌రీరం నీళ్లు లేక డీహైడ్రేష‌న్‌కు కూడా గుర‌వుతుంది. అలాగే త‌ల‌తిర‌గ‌డం, వికారంగా ఉండడం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించడం వంటి ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. ఆక‌లి పూర్తిగా న‌శిస్తుంది. ఆహారం తినాల‌నిపించ‌దు. వీట‌న్నింటినీ హ్యాంగోవ‌ర్ ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు..

మ‌ద్యం సేవించిన అనంత‌రం హ్యాంగోవ‌ర్ రాకుండా ఉండాలంటే ప‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మ‌ద్యం సేవించే స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉండే ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. ప‌ల్లీలు, అవ‌కాడో, బాదంప‌ప్పు, జీడిప‌ప్పు వంటి ఆహారాల‌ను తినాలి. వీటి వ‌ల్ల శ‌రీరం మ‌ద్యాన్ని త్వ‌ర‌గా శోషించుకోదు. శ‌రీరంలో ఆల్క‌హాల్ స్థాయిలు నెమ్మ‌దిగా పెరుగుతాయి. దీంతో హ్యాంగోవ‌ర్ రాకుండా ఉంటుంది. అయితే ప‌ల్లీలు, జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వంటి వాటిని వేయించి లేదా ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాలి. ఉప్పు, కారం, చీజ్‌, మ‌సాలా, చ‌క్కెర వంటివి చ‌ల్లి తింటే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాగే మ‌ద్యం సేవించే స‌మ‌యంలో ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను తిన్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. వీటి వ‌ల్ల కూడా మ‌ద్యం నెమ్మ‌దిగా శ‌రీరంలో క‌లుస్తుంది. ముఖ్యంగా మొల‌క‌లు వంటి వాటిని తింటే మేలు జ‌రుగుతుంది.

విట‌మిన్ సి పండ్లు, కూర‌గాయ‌లు..

మ‌ద్యం సేవించే స‌మ‌యంలో విట‌మిన్ సి అధికంగా ఉండే ఆహారాలు లేదా పండ్ల‌ను తింటుంటే ఉప‌యోగం ఉంటుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా నారింజ పండ్లు, జామ పండ్లు, స్ట్రాబెర్రీలు వంటి పండ్ల‌తోపాటు క్యాప్సికం, ప‌చ్చి బ‌ఠానీలు వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. క‌నుక వీటిని తింటే హ్యాంగోవ‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిన్నా కూడా మ‌ద్యం త్వ‌ర‌గా శోషించ‌బ‌డ‌కుండా ఉంటుంది. దీంతో హ్యాంగోవ‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే మ‌ద్యం సేవించే వారు కొన్ని పొర‌పాట్లు చేస్తారు. అందువ‌ల్ల కూడా హ్యాంగోవ‌ర్ వ‌స్తుంది. కొంద‌రు మ‌ద్యాన్ని అయిపోతే దొర‌క‌దు అన్న‌ట్లు వెంట వెంట‌నే తాగుతారు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంపై, ముఖ్యంగా లివ‌ర్‌పై తీవ్ర‌మైన ఒత్తిడి ప‌డుతుంది. కిడ్నీలు కూడా ఆల్క‌హాల్ ను బ‌య‌ట‌కు పంపేందుకు ఒకేసారి పెద్ద మొత్తంలో శ్ర‌మించాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌ద్యాన్ని అతి వేగంగా తాగ‌కూడ‌దు. చాలా నెమ్మ‌దిగా తాగాలి. దీంతో హ్యాంగోవ‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

ఈ త‌ప్పులు చేయ‌వ‌ద్దు..

కొంద‌రు మ‌ద్యం సేవించే స‌మ‌యంలో స్నాక్స్ పేరిట ఫుడ్స్‌ను పెద్ద మొత్తంలో తింటారు. అవ‌న్నీ జీర్ణాశ‌యంలో చేరి గ్యాస్‌ను క‌ల‌గజేస్తాయి. దీని కార‌ణంగా వాంతికి వ‌స్తుంది. అలాగే హ్యాంగోవ‌ర్ కూడా వ‌స్తుంది. క‌నుక మ‌ద్యం సేవించే స‌మ‌యంలో స్నాక్స్‌ను చాలా త‌క్కువ‌గా తినాలి. పొట్ట‌ను లైట్‌గా ఉంచేందుకు య‌త్నించాలి. కొంద‌రు విస్కీ, ర‌మ్‌, వోడ్కా లాంటి మ‌ద్యాన్ని సేవిస్తే కూల్ డ్రింక్స్‌తో క‌లిపి తాగుతారు. అలా తాగ‌డం వ‌ల్ల కిడ్నీల‌పై తీవ్ర భారం ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా పెరుగుతాయి. క‌నుక అలా తాగ‌డం మంచిది కాదు. సోడా లేదా నీటిని మాత్ర‌మే ఉపయోగించాలి. అవ‌స‌రం అయితే పండ్ల ర‌సం క‌లుపుకోవ‌చ్చు. ఇక కొంద‌రు అన్ని ర‌కాల మ‌ద్యం బ్రాండ్ల‌ను క‌లిపి కాక్ టెయిల్ లాగా తాగుతారు. అలా చేయ‌డం కూడా ప్రమాద‌క‌ర‌మే. దీని వల్ల మ‌ద్యం మ‌త్తులోకి త్వ‌ర‌గా జారుకోవ‌డ‌మే కాదు, హ్యాంగోవ‌ర్ కూడా త్వ‌ర‌గా వ‌స్తుంది. క‌నుక కాక్ టెయిల్ కాకుండా ఏదైనా ఒక బ్రాండ్ మ‌ద్యాన్నే చాలా నెమ్మ‌దిగా సేవించాలి. అలాగే వీలైనంత వ‌ర‌కు ఖ‌రీదైన మ‌ద్యాన్ని సేవిస్తే హ్యాంగోవ‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఇలా ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ ఆహారాల‌ను తీసుకుంటే ఈ న్యూయ‌ర్ పార్టీని చాలా గ్రాండ్ గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మ‌రుస‌టి రోజు ఉద‌యం హ్యాంగోవ‌ర్ రాకుండా ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement