Pralay Missile | భారత అమ్ముల పొదిలో కొత్తగా ప్రళయ్ క్షిపణులు.. ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే..
Pralay Missile | ప్రత్యర్థి దేశాలకు చుక్కలు చూపించేందుకు భారత అమ్ములపొదిలో ఇప్పటికే ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అనేక క్షిపణులు, రాడార్లు, డ్రోన్ వ్యవస్థ, రక్షణ పరికరాలు ఇలా అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మరో అస్త్రం భారత అమ్ముల పొదిలో చేరింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన నూతన క్షిపణి ప్రళయ్ ఆ ఖాతాలో వచ్చి చేరింది.
Pralay Missile | ప్రత్యర్థి దేశాలకు చుక్కలు చూపించేందుకు భారత అమ్ములపొదిలో ఇప్పటికే ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అనేక క్షిపణులు, రాడార్లు, డ్రోన్ వ్యవస్థ, రక్షణ పరికరాలు ఇలా అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మరో అస్త్రం భారత అమ్ముల పొదిలో చేరింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన నూతన క్షిపణి ప్రళయ్ ఆ ఖాతాలో వచ్చి చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డిసెంబర్ 31వ తేదీన బుధవారం ఉదయం ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణులను పరీక్షించింది. ఈ క్షిపణులను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయగా ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో వీటికి నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఈ ద్వీపం నుంచి సాల్వో ప్రయోగాన్ని తాజాగా చేపట్టారు. అందులో భాగంగా రెండు ప్రళయ్ క్షిపణులను ఒకదాని తరువాత ఒకటి వెంట వెంటనే ప్రయోగించారు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో అవి వెంట వెంటనే దూసుకెళ్లాయి.
ఒకే లాంచర్ నుంచి..
ప్రళయ్ క్షిపణులకు తాజాగా నిర్వహించినవి యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ కాగా ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. ట్రయల్స్‌లో భాగంగా ఆ రెండు క్షిపణులు ఒకదాని వెంట మరొకటి వెంట వెంటనే వెళ్లడం ఒకెత్తయితే, అవి నిర్దేశిత మార్గంలోనే ప్రయాణం చేసి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడం మరొక విశేషంగా చెప్పవచ్చు. ఒకే లాంచర్ నుంచి ఇలా రెండు క్షిపణులను వెంట వెంటనే ప్రయోగించడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అమెరికా వంటి దేశాల దగ్గరే ఈ పరిజ్ఞానం ఉంటుంది. కానీ మన దేశం కూడా దీన్ని సొంతంగా అభివృద్ధి చేయడం విశేషం. కాగా ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల యుద్ధ సమయంలో శత్రువుల రక్షణ వ్యవస్థలను చాలా త్వరగా ధ్వంసం చేయడానికి వీలు కలుగుతుంది. ఈ క్రమంలోనే ప్రళయ్ క్షిపణుల ప్రయోగం విజయవంతం అవడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల భారత సైన్యం, వైమానిక దళం యుద్ధ సామర్థ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.
గంటకు 7400 కిలోమీటర్ల వేగంతో..
కాగా ప్రళయ్ క్షిపణులను ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. ఇది ఒక పాక్షిక బాలిస్టిక్ క్షిపణి. సుమారుగా 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది సులభంగా ఛేదిస్తుంది. గంటకు సుమారుగా 7400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శత్రువుల రాడార్లకు కూడా ఈ క్షిపణి లభించదు. అంత వేగంగా ఇది ప్రయాణిస్తుంది. ఈ క్షిపణి ప్రయాణించే మార్గంలోనే దిశను మార్చుకోగలదు. కనుక దీన్ని ఇంటర్ సెప్టర్ క్షిపణులతో అడ్డుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక ప్రళయ్ క్షిపణి 500 నుంచి 1000 కిలోల బరువు ఉన్న యుద్ధ సామగ్రిని తీసుకెళ్లగలదు.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝟐𝟎𝟐𝟔 𝐰𝐢𝐭𝐡 𝐚 𝐝𝐞𝐜𝐢𝐬𝐢𝐯𝐞 𝐥𝐞𝐚𝐩 𝐢𝐧 𝐝𝐞𝐟𝐞𝐧𝐜𝐞 𝐬𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡! 🇮🇳🚀
DRDO’s successful salvo launch of two Pralay missiles from the same launcher demonstrates precision, speed and indigenous technological excellence.
Equipped with… pic.twitter.com/qZOQHE6q6i
— BJP (@BJP4India) January 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






