త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST Change On Tobacco Products | పొగ తాగేవారికి దిమ్మ తిరిగే షాక్‌.. పొగాకు ఉత్ప‌త్తుల‌పై భారీగా ప‌న్ను వ‌డ్డింపు..

GST Change On Tobacco Products | పొగ తాగేవారికి కేంద్ర ప్ర‌భుత్వం దిమ్మ తిరిగే షాకిచ్చింది. పొగాకు, పాన్ మ‌సాలా ఉత్ప‌త్తుల‌పై భారీగా ప‌న్ను వ‌డ్డిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ అంశంపై ఇది వ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా బుధ‌వారం దీన్ని కేంద్రం నోటిఫై చేసింది.

S

Business | Published On Jan 1, 2026, 11.25 am IST

GST Change On Tobacco Products | పొగ తాగేవారికి దిమ్మ తిరిగే షాక్‌.. పొగాకు ఉత్ప‌త్తుల‌పై భారీగా ప‌న్ను వ‌డ్డింపు..
Advertisement

GST Change On Tobacco Products | పొగ తాగేవారికి కేంద్ర ప్ర‌భుత్వం దిమ్మ తిరిగే షాకిచ్చింది. పొగాకు, పాన్ మ‌సాలా ఉత్ప‌త్తుల‌పై భారీగా ప‌న్ను వ‌డ్డిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ అంశంపై ఇది వ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా బుధ‌వారం దీన్ని కేంద్రం నోటిఫై చేసింది. ఏయే ఉత్ప‌త్తుల‌పై ఎంత శాతం ప‌న్ను విధిస్తున్నారు, ఈ నూత‌న పన్ను వ‌డ్డింపు ఎప్ప‌టి నుంచి అమ‌లవుతుంది.. అన్న వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించారు. కేంద్రం ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి పాన్ మ‌సాలా, సిగ‌రెట్లు, బీడీ, ఇతర పొగాకు ఉత్ప‌త్తుల‌పై 40 శాతం జీఎస్‌టీని వ‌సూలు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయా ఉత్ప‌త్తుల ధ‌రలు భారీగా పెర‌గ‌నున్నాయి.

జీఎస్టీ, అద‌న‌పు ప‌న్ను..

పాన్ మ‌సాలా, పొగాకు ఉత్ప‌త్తుల‌పై ప్ర‌స్తుతం 28 శాతం జీఎస్‌టీతోపాటు కంపెన్సేష‌న్ సెస్ విధిస్తున్నారు. దీనికి మార్చి 2026 వ‌ర‌కు గ‌డువు ఉంది. అయితే ఆ గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆయా ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీని పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఇప్ప‌టికే వ‌సూలు చేస్తున్న కంపెన్సేష‌న్ సెస్ ను ర‌ద్దు చేయ‌డంతోపాటు దాని స్థానంలో కొత్త‌గా మ‌రో సెస్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. హెల్త్ అండ్ నేష‌న‌ల్ సెక్యూరిటీ సెస్ పేరిట కొత్త సెస్‌ను వ‌సూలు చేయ‌డంతోపాటు అద‌న‌పు ఎక్సైజ్ ప‌న్నును కూడా విధించ‌నున్నారు. కొత్త సెస్‌ను పాన్ మ‌సాలాపై విధించ‌నుండ‌గా, పొగాతు ఉత్ప‌త్తుల‌పై అద‌న‌పు ఎక్సైజ్ ప‌న్ను విధిస్తారు. ఈ క్ర‌మంలో ఆయా ఉత్ప‌త్తుల‌పై నూత‌న ప‌న్ను విధానం పిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌లులోకి రానుంది. దీని వ‌ల్ల ఆ తేదీ నుంచి పాన్ మ‌సాలా, పొగాకు ఉత్ప‌త్తుల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌బోతున్నాయి. నూత‌న ప‌న్ను విధానం ప్ర‌కారం పొగాకు ఉత్ప‌త్తుల‌పై 40 శాతం జీఎస్‌టీ ఉంటుంది, అలాగే అద‌నపు ఎక్సైజ్ ప‌న్నును వ‌సూలు చేస్తారు. ఇక పాన్ మ‌సాలా లేదా దానికి సంబంధం క‌లిగిన ఉత్ప‌త్తుల‌పై కూడా 40 శాతం జీఎస్‌టీ ఉంటుంది. కానీ ఈ ఉత్ప‌త్తుల‌పై హెల్త్ అండ్ నేష‌న‌ల్ సెక్యూరిఈ సెస్‌ను విధిస్తారు. ఇలా ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌లను పెంచ‌నున్నారు.

ఎంత వ‌ర‌కు పెర‌గ‌వ‌చ్చు..?

అయితే నూత‌న ప‌న్ను విధానం వ‌ల్ల చ‌వ‌క సిగ‌రెట్ల ధ‌ర‌లు రూ.2 నుంచి రూ.10 మేర పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ప్రీమియం సిగ‌రెట్ల ధ‌ర‌లు రూ.20 నుంచి రూ.30 వ‌ర‌కు పెరుగుతాయ‌ని అంటున్నారు. కొత్త ఎక్సైజ్ ప‌న్ను ప్ర‌కారం 1000 సిగ‌రెట్ల‌కు రూ.2వేల నుంచి రూ.8500 వ‌ర‌కు ప‌న్ను విధిస్తారు. ఇది సిగ‌రెట్ పొడ‌వు, ఫిల్ట‌ర్ ర‌కంపై కూడా ఆధార ప‌డి ఉంటుంది. ఇక 10 సిగ‌రెట్లు ఉండే చ‌వ‌క సిగ‌రెట్ ప్యాకెట్ల ధ‌ర రూ.80 వ‌ర‌కు పెరుగుతుంద‌ని తెలుస్తోంది. ప్రీమియం సిగ‌రెట్ ప్యాకెట్ల ధ‌ర రూ.200 నుంచి రూ.400 మేర పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే పొగాకు ఉత్ప‌త్తుల‌పై విధించిన భారీ ప‌న్నుల కార‌ణంగా ఆ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్న సంస్థ‌ల షేర్లు కూడా బుధ‌వారం బాగా ప‌డిపోయాయి. ఐటీసీ షేర్ల ధ‌ర‌ల‌లో 6 శాతం వ‌ర‌కు త‌గ్గుద‌ల క‌నిపించింది. మ‌రో కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్ల ధ‌ర‌లు కూడా 7 శాతం మేర ప‌త‌నం అయ్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement