Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి
Skin Care | చలికాలంలో చర్మం పొడిబారకుండా కాంతివంతంగా మెరిసిపోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు (Skin Cre Tips For Winter Season). చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు. అంతేకాదు, మంచి నిద్ర, సహజ పదార్థాలున్న సబ్బులు వాడాలని సూచిస్తున్నారు.
Skin Care | చలికాలం వచ్చిందంటే (Winter Season) చాలు చర్మ సమస్యలూ (Skin Care) మొదలవుతాయి. శీతకాలంలో పొడి చర్మం ప్రతిఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. దీంతో ప్రతీ ఒక్కరూ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం ఇస్తాయి. పొడిచర్మం సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే.. చర్మం పొడిబారకుండా, లోపలి నుంచి ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసిపోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నీళ్లు మానొద్దు
చలికాలం కావడంతో దాహం వేయదు. పైగా వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లకు బదులు కాఫీలు, టీలకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కాఫీ, టీలలో ఉండే 'కెఫిన్' మూత్రవిసర్జనను పెంచి, శరీరం నుండి నీటిని త్వరగా బయటకు పంపేస్తుంది. ఫలితంగా చాలామంది తెలియకుండానే డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. చర్మం పాలిపోతుంది, పొడిబారుతుంది, పగుళ్లు వస్తాయి. చర్మం రోజంతా తేమగా ఉండాలంటే.. శరీరానికి తగినంత నీరు అందించాలి. దాహం వేసే వరకు ఆగకుండా ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఇది చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్‌గా ఉంచుతుంది.
హెర్బల్ టీ బెటర్
అంతగా తాగాలనుకుంటే టీ, కాఫీలకు బదులుగా.. అల్లం, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన ‘హెర్బల్ టీ’ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా
ఉంచడంతోపాటు, బాడీకి కావాల్సిన వేడిని అందిస్తాయి.
వేడినీళ్లతో స్నానమా..?
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరూ చేసే తప్పు చాలా వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం. కానీ ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి వాతావరణం
చర్మంలోని సహజమైన నూనెలను తగ్గిస్తుంది. దీనికి తోడు వేడినీళ్ల స్నానం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడి
రక్తస్రావ సమస్యలు వస్తాయి. ఎంత చల్లటి వాతావరణమైనా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమే
ఉత్తమం.
సాధారణ సబ్బులను పక్కన పెట్టండి
చలికాలంలో సాధారణ రోజుల్లో ఉపయోగించే సబ్బులను వాడటం మానేయాలి. రసాయనాలు ఎక్కువగా ఉండే సాధారణ సబ్బులు చర్మంలోని సహజమైన నూనెను పూర్తిగా తొలగించి, చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల చర్మంపై ముడతలు, దురదలు, ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కలబంద, పసుపు, వేప లాంటి సహజ పదార్థాలున్న సబ్బులను వాడటం ఉత్తమం. రసాయనాల జాడలేని సేంద్రియ సబ్బులు వాడటం మరీ మంచిది. ముఖ్యంగా సున్నిపిండితో స్నానం చేయడం చాలా మంచిది. పెసరపిండి, శనగపిండి, నలుగుపిండి వంటి వాటితో చేసే స్నానం చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగించి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.
8 గంటల నిద్ర..
ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే సరైన నిద్ర చాలా అవసరం. అదేవిధంగా చర్మం ఆరోగ్యానికి కూడా మంచి నిద్ర ముఖ్యం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలో చర్మం కొత్త కొల్లాజెన్‌ను తయారు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. నిద్రపోయేటప్పుడు చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల ఉదయానికి ముఖం తేటగా, కాంతివంతంగా కనిపిస్తుంది. తక్కువ నిద్రపోతే కళ్ల కింద రక్తనాళాలు ఉబ్బి, నల్లటి వలయాలు (Dark Circles), వాపు వస్తాయి. దీంతో ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన నిద్ర ఈ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది.
స్వెటర్ ఒక్కటే సరిపోదు..!
శీతాకాలంలో చలిని తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరూ స్వెటర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ మాత్రమే సరిపోదు. కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులూ ముఖ్యమే. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..
- ●Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్
- ●ORR Road accident | దీపావళి పండగ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండగా రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే!
- ●16 రోజుల్లో 2500 కి.మీ... రామేశ్వరం నుంచి అయోధ్యకు యువకుడి సైకిల్ యాత్ర
- ●Diwali Bonus | ఒక్కొక్కరికి రూ.లక్ష.. ఉద్యోగులకు గుజరాత్ వ్యాపారి దీపావళి బోనస్
- ●Diwali 2026 | దీపావళి పూజలో కమల పుష్పానికే ఎందుకంత ప్రాధాన్యం?

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..

Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్

ORR Road accident | దీపావళి పండగ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండగా రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే!

16 రోజుల్లో 2500 కి.మీ... రామేశ్వరం నుంచి అయోధ్యకు యువకుడి సైకిల్ యాత్ర






