త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మ‌హ‌త్య‌.. స్థానికుల స‌మాచారంతో వెలుగులోకి..

Three dies by Suicide | దీపావ‌ళి పండ‌గ వేళ వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఉద‌యం ఓఆర్ఆర్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా (Three dies by suicide) ఆ వెంట‌నే మరో విషాద ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

S

Telangana | Published On Nov 8, 2026, 11.49 am IST

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మ‌హ‌త్య‌.. స్థానికుల స‌మాచారంతో వెలుగులోకి..
Advertisement

Three dies by Suicide | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి పండ‌గ వేళ వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఉద‌యం ఓఆర్ఆర్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా (Three dies by suicide) ఆ వెంట‌నే మరో విషాద ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. గ‌చ్చిబౌలి (Gachibowli)లో ఒకే కుటుంబానికి చెందిన త‌ల్లిదండ్రులు, కుమారుడు విగ‌త‌జీవులుగా ప‌డి ఉండడం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

గ‌చ్చిబౌళి సీఐ సైదులు వివ‌రాల ప్ర‌కారం.. గౌలిదొడ్డిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏడాది నుంచి బత్తుల మారెడ్డి (65), ఆయ‌న భార్య భార‌తి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38) తో క‌లిసి నివాస‌ముంటున్నారు. ఆదివారం ఉద‌యం ప్లాట్‌లో ముగ్గురూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు మాకు స‌మాచారం అందింది. కుటుంబంలో ఉన్న స‌మ‌స్య‌లు, అనారోగ్య కార‌ణాల‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని భావిస్తున్నాం. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించాం. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement