త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor visit Bhagyalakshmi temple | పేద‌ల జీవితాల్లో వెలుగులు పంచ‌డ‌మే దీపావ‌ళి స్ఫూర్తి: గ‌వ‌ర్న‌ర్‌

 Governor visit Bhagyalakshmi temple | దీపాల పండ‌గ‌ను పురస్క‌రించుకొని గవర్నర్ శివప్రతాప్​ శుక్లా (Governor Shivaprathap Shukla) దంపతులు పాత‌బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ (Charminar Bhagyalakshmi) అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు.

S

Telangana | Published On Nov 8, 2026, 11.23 am IST

Governor visit Bhagyalakshmi temple | పేద‌ల జీవితాల్లో వెలుగులు పంచ‌డ‌మే దీపావ‌ళి స్ఫూర్తి: గ‌వ‌ర్న‌ర్‌
Advertisement

Governor visit Bhagyalakshmi temple | త్రినేత్ర న్యూస్‌: దీపాల పండ‌గ‌ను పురస్క‌రించుకొని గవర్నర్ శివప్రతాప్​ శుక్లా (Governor Shivaprathap Shukla) దంపతులు పాత‌బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ (Charminar Bhagyalakshmi) అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గవర్నర్​ దంపతులకు ఆలయ నిర్వాహకులు మేళ‌తాళాల మ‌ధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు చేయ‌గా అర్చకులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలకు ఎక్స్​ వేదికగా గవర్నర్​ దీపావళి శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. ఈ పండుగను ప్రేమ, కరుణ, సేవా, పరస్పర సహకారంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. నిరుపేదలు, కష్టాల్లో ఉన్నవారి జీవితాల్లో ఆనందాన్ని, ఆశను పంచడంలోనే దీని నిజమైన స్ఫూర్తి ఉందని స్ప‌ష్టం చేశారు.

క‌ష్టాల‌ను ఎదుర్కొనే శ‌క్తినివ్వాల‌ని కోరుకున్నా: రాంచందర్​రావు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్​రావు కుటుంబ సభ్యులతో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆలయ నిర్వహకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

"దీపావళి పండుగ సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాను. తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా, సుఖంగా ఉండాలి. కష్టాలను ఎదుర్కొనే శక్తిని అమ్మవారు ఇవ్వాలని కోరుకున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు రావాలి. అందరిపై భాగ్యలక్ష్మి అమ్మవారి అశీస్సులు ఉండాలని కోరుకున్నా అని రాంచందర్​రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement