త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ORR Road accident | దీపావ‌ళి పండ‌గ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. ఎంత మంది చ‌నిపోయారంటే!

Road Accident | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీజీ పోలీస్‌ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (ORR Road accident) జ‌రిగింది.

S

Hyderabad | Published On Nov 8, 2026, 10.51 am IST

ORR Road accident | దీపావ‌ళి పండ‌గ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. ఎంత మంది చ‌నిపోయారంటే!
Advertisement

ORR Road accident | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీజీ పోలీస్‌ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (ORR Road accident) జ‌రిగింది. డీసీఎంను వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా (Three dies) మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆటో శంషాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముచ్చింత‌ల్‌లో చెట్లు నాటే ప‌నికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా మృత్యువు క‌బ‌ళించింది. మృతి చెందిన వారిని సురేశ్‌, పెంట‌య్య‌, లింగ‌రాజుశెట్టిగా గుర్తించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement