త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sea Mines | అలా చేస్తే.. పర్షియన్‌ గ‌ల్ఫ్ అంత‌టా సీమైన్స్ అమర్చుతాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్‌

Sea Mines | అగ్ర‌రాజ్యానికి టెహ్రాన్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే మొత్తం పర్షియన్‌ గల్ఫ్‌ (Persian Gulf)తోపాటూ తీర ప్రాంతాల వెంట అన్ని మార్గాల్లో మందుపాతర్లు అమ‌రుస్తామ‌ని, నావ‌ల్ మైన్స్‌ను మోహ‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది.

D

International | Published On Mar 23, 2026, 4.37 pm IST

Sea Mines | అలా చేస్తే.. పర్షియన్‌ గ‌ల్ఫ్ అంత‌టా సీమైన్స్ అమర్చుతాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్‌
Advertisement

Sea Mines | ప‌శ్చిమాసియాలో యుద్ధం నాలుగోవారానికి చేరింది. ఇరాన్‌ (Iran)పై భూత‌ల దాడుల‌కు అమెరికా సిద్ధ‌మైందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇరాన్ చ‌మురు ఎగుమ‌తుల్లో కీల‌క‌మైన ఖ‌ర్గ్ ఐలాండ్ స్వాధీనానికి ట్రంప్ ప్లాన్ చేసిన‌ట్లు ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యానికి టెహ్రాన్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే మొత్తం పర్షియన్‌ గల్ఫ్‌ (Persian Gulf)తోపాటూ తీర ప్రాంతాల వెంట అన్ని మార్గాల్లో మందుపాతర్లు అమ‌రుస్తామ‌ని, నావ‌ల్ మైన్స్‌ను మోహ‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఇరాన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఓ ప్రకటన జారీచేసింది.

ఇరాన్ తీరం, ద్వీపాలపై ఎలాంటి దాడి జరిగినా పర్షియన్ గల్ఫ్ అంతటా పేలుడు పదార్థాలతో కూడిన సముద్రపు గనులను (sea mines) మోహరిస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించింది. ఇది గల్ఫ్ షిప్పింగ్ మార్గాలను, కమ్యూనికేషన్ లైన్లను దెబ్బతీస్తుందని హెచ్చ‌రించింది. "ఇరాన్ తీరాలు, ద్వీపాలపై దాడికి శత్రువు చేసే ఏ ప్రయత్నమైనా.. గల్ఫ్ అంత‌టా ఫ్లోటింగ్ మైన్స్ (floating mines) స‌హా వివిధ ర‌కాల సీమైన్స్ ఏర్పాటుకు దారి తీస్తుంది. మా తీరం నుంచే వాటిని జ‌లాల్లోకి ప్ర‌వేశ‌పెట్ట‌గ‌లం. ఈ చ‌ర్య‌తో మొత్తం గ‌ల్ఫ్ ప్రాంతం అంత‌టా సుదీర్ఘ‌కాలం పాటూ హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో (Strait of Hormuz) నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులే ఉంటాయి. 1980ల్లో కొన్ని సీమైన్స్‌ను తొల‌గించ‌డంలో 100 మైన్ స్వీప‌ర్లు విఫ‌ల‌మైన విష‌యాన్ని ఎవరూ మర్చిపోకూడదు" అని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించింది.

Also Read..

వార్ ఎఫెక్ట్‌.. ఇక 10 కేజీల ఎల్పీజీ సిలిండ‌ర్‌ స‌ర‌ఫ‌రా..?

పాక్ కు కీల‌క స‌మాచారం చేర‌వేత‌.. వాయుసేన ఉద్యోగి అరెస్టు

కుటుంబాలు వీధిన‌ప‌డొద్ద‌నే రూ.కోటి బీమా : సీఎం రేవంత్‌

Advertisement

తాజావార్తలు

Advertisement