త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కుటుంబాలు వీధిన‌ప‌డొద్ద‌నే రూ.కోటి బీమా : సీఎం రేవంత్‌

P

Flash news | Published On Mar 23, 2026, 3.57 pm IST

CM Revanth Reddy | కుటుంబాలు వీధిన‌ప‌డొద్ద‌నే రూ.కోటి బీమా : సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy | విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు సీఎం రేవంత్‌రెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి పది లక్షలకు పెంచిన‌ట్లు చెప్పారు. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దని భావనతో కుటుంబ బీమా తెచ్చామ‌న్నారు.

విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ.కోటిపైన ప్రమాద బీమా సౌకర్యం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు సీఎం అందించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేప‌ట్టామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement