త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Espionage | పాక్ కు కీల‌క స‌మాచారం చేర‌వేత‌.. వాయుసేన ఉద్యోగి అరెస్టు

Espionage | పాకిస్థాన్‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై భార‌త వాయుసేన (Air Force) ఉద్యోగిని రాజ‌స్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. వేరే కేసు దర్యాప్తులో భాగంగా ఈ గూఢచర్యం (Espionage) విషయం బయట ప‌డింద‌ని పోలీసులు తెలిపారు.

S

News | Published On Mar 23, 2026, 4.15 pm IST

Espionage | పాక్ కు కీల‌క స‌మాచారం చేర‌వేత‌.. వాయుసేన ఉద్యోగి అరెస్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పాకిస్థాన్‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై భార‌త వాయుసేన (Air Force) ఉద్యోగిని రాజ‌స్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోస‌మే దేశ భ‌ద్ర‌త‌ను తాక‌ట్టు పెట్టాడు ఈ ప్ర‌బుద్ధుడు. పాక్‌కు చెందిన వారితో ప‌రిచ‌యాలుండ‌డ‌మే కాకుండా గూఢ‌చర్యం చేస్తున్న‌ట్లు దర్యాప్తులో నిర్ధారించారు. వేరే కేసు దర్యాప్తులో భాగంగా ఈ గూఢచర్యం (Espionage) విషయం బయట ప‌డింద‌ని పోలీసులు తెలిపారు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరా రామ్‌ను ఓ కేసులో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలతో సంబంధం ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ సుమిత్ కుమార్‌ (Sumith kumar) గురించి తెలిసింది. ఇత‌డు అసోంలోని దిబ్రుగఢ్‌ జిల్లాలో చబువా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్‌ వింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాయుసేన రహస్య సమాచారాన్ని పాక్‌కు చేర‌వేసిన‌ట్లు దర్యాప్తులో గుర్తించారు. డబ్బు కోసమే దేశ భ‌ద్ర‌త‌ను తాకట్టు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

సుమిత్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు నిమిత్తం జైపూర్‌కు తరలించారు. అతడికి 2023 నుంచి పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెప్పారు. వారి నుంచి డబ్బు తీసుకొని యుద్ధ విమానాలు (aircraft), క్షిపణుల వ్యవస్థ, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు, ఉద్యోగుల కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు అందించిన‌ట్లు తేలింద‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement