Iran-Israel War | 11 అణుబాంబుల తయారీ.. అందుకనే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం..?
Iran-Israel War | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సంచలన విషయాలను వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అన్న కారణాలను వివరించారు.
International | Published On Mar 4, 2026, 12.35 pm IST
Iran-Israel War | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సంచలన విషయాలను వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అన్న కారణాలను వివరించారు. గత నెలలో జెనీవాలో అమెరికా మూడు ప్రతిపాదనలను ఇరాన్ ముందు ఉంచిందని, టెహ్రాన్‌లో కొనసాగిస్తున్న అణ్వాయుధ, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని, హెజ్‌బొల్లా వంటి గ్రూపులకు అందిస్తున్న మిలిటరీ సహాయాన్ని ఆపేయాలని, ఆ గ్రూపులకు చెందిన నౌకా దళాలను పూర్తిగా నిర్మూలించాలని ఇరాన్‌కు అమెరికా ప్రతిపాదించిందని అన్నారు. అయితే ఆశించిన విధంగా ఫలితం రాలేదని తెలిపారు.
460 కిలోల యురేనియం.. 11 అణుబాంబులు..
ఇరాన్ రాయబారులు తమ దేశం వద్ద 460 కిలోల యురేనియం ఉన్నట్లు అంగీకరించారని, కానీ వారు దాన్ని అణ్వాయుధాల తయారీకి వాడబోమని తెలిపారని, వైద్య, విద్యుత్ రంగాల కోసం వాడుతామని చెప్పారని విట్కాఫ్ వెల్లడించారు. అయితే ఇరాన్ పాల్పడుతున్న చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అందుకనే అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయని తెలిపారు. కాగా ఇరాన్ పాల్పడుతున్న చర్యలపై ఆయన పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ ఇటీవలే ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి గిడియన్ మీడియాతో మాట్లాడుతూ.. వారు (ఇరాన్) 460 కిలోల యురేనియంను ఇప్పటికే 60 శాతం మేర శుద్ధి చేశారు. 90 శాతం మేర శుద్ధి చేస్తేనే యురేనియంను అణుబాంబు తయారీకి వాడేందుకు వీలుంటుంది. వారు ఓ వైపు అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు నటిస్తూనే మరోవైపు యురేనియం శుద్ధి పనిలో నిమగ్నమయ్యారు. దాడి చేసినా నష్టం కలగని విధంగా చాలా లోతులో భూగర్భానికి ఆ యురేనియాన్ని, ఇతర ఆయుధాలను తరలించారు. ఆ యురేనియంతో 11 అణుబాంబులను తయారు చేయవచ్చు. అమెరికా-ఇజ్రాయెల్‌కు తమ తమ దేశాలను రక్షించుకునే హక్కు ఉంటుంది.. అన్నారు. దీంతో ఇదే ప్రధాన కారణంతో ఈ యుద్ధం ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
https://twitter.com/Acyn/status/2028661576363024524
భూగర్భంలో దాచి ఉండవచ్చు: జేడీ వాన్స్
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇటీవలే ఇరాన్‌లో 60 శాతం శుద్ది చేయబడిన యురేనియం కనిపించడం లేదని తమకు నివేదిక వచ్చిందని స్పష్టం చేశారు. వారు (ఇరాన్) బహుశా దాన్ని భూగర్భంలో 70 నుంచి 80 అడుగుల లోతులో దాచి ఉండవచ్చు, దాంతో అణుబాంబులను తయారు చేస్తుండవచ్చు.. అని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా వాన్స్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు స్పష్టం చేశాయి. యురేనియంను ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని ఇరాన్ చెబుతున్నప్పటికీ ఆ సంస్థ మాత్రం ఇరాన్ వ్యాఖ్యలపై సందేహం వ్యక్తం చేసింది. అయితే ప్రధానంగా ఈ విషయంలోనే ఇరాన్ అంగీకరించకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ





