KTR | పొట్టను దాచుకోలేకపోతున్నా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR | నిత్యం ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో గళమెత్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు (ktr interesting tweet). తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
KTR | నిత్యం ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో గళమెత్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు (ktr interesting tweet). తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తన పొట్టను దాచుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. అందుకే మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ట్వీట్ పెట్టారు.
"నేను నా పొట్టను దాచుకోలేక విసిగిపోయాను. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ జిమ్ చేయడం స్టార్ చేశాను. జులై నాటికి నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికల్లా మంచి ఫిట్‌నెస్ సాధిస్తానని ఆశిస్తున్నాను" అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు జిమ్‌లో దిగిన ఫొటోను జత చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే వేలల్లో లైక్స్ వచ్చాయి. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. "ఇప్పటికే మీరు చాలా ఫిట్‌గా ఉన్నారు అన్నా" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://x.com/KTRBRS/status/2031559481990271278
కేటీఆర్ తన ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నేతగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి మాత్రం కొంత సమయం కేటాయిస్తుంటారు. నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. 50 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. గతంలో ఓ సారి జిమ్ చేస్తూ ఆయన గాయపడిన విషయం తెలిసిందే.
Also Read..
Iranian Mine Laying Boats | హర్మూజ్ సమీపంలో ఇరాన్ మైన్ లేయింగ్స్‌పై అమెరికా భీకర దాడులు
Harish Rana | 13 ఏండ్లు కోమాలోనే.. అతనికి చనిపోయే హక్కు ఉందా?.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
సంబంధిత వార్తలు

KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగల్లా తొలగించారు
ఆగస్టు 18, 2026

Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?
ఆగస్టు 18, 2026

RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



