Harish Rana | 13 ఏండ్లు కోమాలోనే.. అతనికి చనిపోయే హక్కు ఉందా?.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించనుంది.
Harish Rana | త్రినేత్ర.న్యూస్: సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించనుంది. తన కుమారుడికి కారుణ్య మరణం (Passive Euthanasia) ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 15న తీర్పును రిజర్వు చేసింది. ‘ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని మేం ఉపయోగించలేం. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. మేమూ మనుషులమే. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామని వెల్లడించిన సుప్రీంకోర్టు తీర్పును మాచ్చి 11కు వాయిదావేసింది.
ఎవరీ హరీశ్ రాణా..
ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల హరీశ్ రాణా.. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో, 2013 ఆగస్టు 20న ప్రమాదవశాత్తు పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.
ఇన్నేండ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. అయితే జీవచ్చవంలా పడిఉన్న తమ కుమారుడిని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. మెడికల్ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జనవరి 15న తీర్పును రిజర్వ్ చేశారు. మార్చి 11న తుది తీర్పును వెళ్లడిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
జులై 16, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



