Iranian Mine Laying Boats | హర్మూజ్ సమీపంలో ఇరాన్ మైన్ లేయింగ్స్‌పై అమెరికా భీకర దాడులు
Iranian Mine Laying Boats | హర్మూజ్ జలసంధి (Strait Of Hormuz) సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్‌లేయింగ్స్ నౌకలను (Iranian Mine Laying Boats) అమెరికా పేల్చేసింది. దాదాపు 16 మైన్ లేయింగ్స్‌ను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) తెలిపింది. తమ దాడిలో పలు నౌకలు కూడా ధ్వంసమైనట్లు వెల్లడించింది.
International | Published On Mar 11, 2026, 10.24 am IST
Iranian Mine Laying Boats | పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులను పెంచాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితి కనిపించడం లేదు సరికదా దాడులు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడులు తాజాగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని (Strait Of Hormuz) తాకాయి.
ఇరాన్ యుద్ధంలో ఈ హర్మూజ్ జలసంధి చాలా కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే.. ఈ జలసంధి గుండా చమురు రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే జలసంధిలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసింది. హర్మూజ్‌కు సమీపంలో మైన్‌లేయింగ్స్ నౌకలను (Iranian Mine Laying Boats) మోహరించింది. అయితే, వాటిని అమెరికా పేల్చేసింది. ఈ నౌకలపై అమెరికా సేనలు విరుచుకుపడ్డాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్స్ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. దాదాపు 16 మైన్ లేయింగ్స్‌ను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) తెలిపింది. తమ దాడిలో పలు నౌకలు కూడా ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు దాడులకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
మరోవైపు ఈ జలసంధిలో భారీ పేలుళ్లకు ఇరాన్ సిద్ధమైనట్లు అమెరికాకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు చేశారు. ఈ జలసంధిలో గనులను మోహరించి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. లేదంటే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మునుపెన్నడూ చూడనిస్థాయిలో ఇరాన్‌పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలు చేసిన తర్వాత అమెరికా సైన్యం ఆ నౌకలపై దాడులు చేయడం గమనార్హం.
https://x.com/CENTCOM/status/2031489675760640370
Also Read..
అతనికి 17.. ఆమెకు 21.. ఇన్‌స్టాలో పరిచయమయ్యారు.. ఇంట్లో చెప్పకుండా..
బంగ్లాదేశ్‌కు 5వేల టన్నుల డీజిల్‌ను పంపిన భారత్.. ఒప్పందంలో భాగంగానే..
హోంవర్క్ చేయలేదని.. పాలిటెక్నిక్ విద్యార్థులను కేబుల్ వైర్లతో కొట్టిన HOD
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026

Dubai | 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్ నగరం
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



