త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా దూరం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే?

J

International | Published On Jul 5, 2026, 4.19 pm IST

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
Advertisement
  • టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు
  • ప్రార్థనల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు.. కానీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ మాత్రం దూరం
  • ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో మోజ్తబాకు తీవ్ర గాయాలయ్యాయన్న కథనాలు
  • ఇజ్రాయెల్ దాడుల ముప్పు ఉన్నందున పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాలని భద్రతా నిపుణుల సలహా

Ali Khamenei Funeral | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో జరిగాయి. కడసారి వీడ్కోలు పలికేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఖమేనీ కుమారుడు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముగ్గురు కుమారులు తండ్రి పాడె వద్ద ఉంటే, ప్రధాన వారసుడిగా ఉన్న మోజ్తబా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Latest and Breaking News on NDTV

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

ఆదివారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా (Imam Khomeini Grand Mosalla) వద్ద జరిగిన ప్రార్థనల్లో అలీ ఖమేనీ ముగ్గురు కుమారులు మోస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీలు పాల్గొన్నారు. స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసిన విజువల్స్‌లో మసౌద్ ఖమేనీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఈ ప్రార్థనల్లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిది తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ జెండాతో కప్పబడిన ఖమేనీ కాఫిన్‌తో పాటు, ఫిబ్రవరి దాడుల్లో మరణించిన ఆయన మనవరాలు సహా మరో నలుగురు బంధువుల మృతదేహాలను కూడా పక్కనే ఉంచారు.

Latest and Breaking News on NDTV

అసలు మోజ్తబా ఏమయ్యారు? పబ్లిక్‌లోకి ఎందుకు రావడం లేదు?

మార్చిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోజ్తబా పబ్లిక్‌గా ఎక్కడా కనిపించలేదు. గత వారం తన భార్య జహ్రా హదాద్-అడెల్, కుమారుడి సంస్మరణ సభకు కూడా ఆయన హాజరుకాలేదు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఖమేనీ కుటుంబంపై చేసిన వైమానిక దాడుల్లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని.. ఆయన కాళ్లకు, ముఖానికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయని రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

Latest and Breaking News on NDTV

వెంటాడుతున్న ఇజ్రాయెల్ ముప్పు (Security Threat)

మోజ్తబా బయటకు రాకపోవడానికి గాయాలతో పాటు భద్రతా కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ (Israel) టార్గెట్ చేసి మళ్లీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో, భద్రతా సిబ్బంది ఆయన్ను పబ్లిక్ అప్పీరెన్స్‌కు దూరంగా ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. "ఆయన స్వరం కూడా బయటకు రాకుండా చూడాలని" భద్రతా నిపుణులు సలహా ఇచ్చినట్లు సమాచారం.

Latest and Breaking News on NDTV

జూలై 9న హాజరవుతారా?

అలీ ఖమేనీ (86) అంత్యక్రియల కార్యక్రమాలు వారం రోజుల పాటు ఐదు నగరాల్లో కొనసాగనున్నాయి. సోమవారం టెహ్రాన్ వీధుల్లో కాఫిన్‌తో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. చివరగా జూలై 9న ఖమేనీ జన్మస్థలమైన మషూద్ (Mashhad) లోని ఇమామ్ రెజా క్షేత్రంలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. ఈ చివరి కార్యక్రమానికైనా మోజ్తబా వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ భద్రతా సంస్థల (IRGC) సమాచారం ప్రకారం.. తండ్రి కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయడానికి ఆయన కనీసం ఈ కార్యక్రమానికైనా హాజరు కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement