Consumer Court | ఎనిమిదేళ్లు వర్క్‌షాప్‌లోనే కారు.. రూ.11లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్..
Consumer Court | సరైన సమయంలో కారు రిపేర్ చేసి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన కేసులో ఓ కార్ల కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. బాధిత కార్ యజమానికి రూ.11లక్షలకుపైగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Consumer Court | సరైన సమయంలో కారు రిపేర్ చేసి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన కేసులో ఓ కార్ల కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. బాధిత కార్ యజమానికి రూ.11లక్షలకుపైగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన కమల్ కుమార్ సరాఫ్ అనే వ్యక్తి నిస్సాన్ ఎవాలియా కారును 2014 జనవరిలో పాట్నాలోని ఉర్జా ఆటోమొబైల్ నుంచి కొనుగోలు చేశారు. ఆ సమయంలో కారు ఖరీదు అక్షరాలా రూ.11.46లక్షలు. అదనంగా రూ.11,322 చెల్లించి ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నారు. అయితే, వారంటీ కార్డు, బిల్లు తనకు ఇవ్వలేదని సరాఫ్ తెలిపారు. నాలుగేళ్ల పాటు కారు ఎలాంటి సమస్యలు లేకుండా నడిచింది. ఆ తర్వాత స్టార్టింగ్ సమస్య వచ్చింది. దాంతో 2018 ఆగస్టులో ముజఫర్‌పూర్‌లోని నిస్సాన్ సర్వీస్ సెంటర్‌లో రిపేరు కోసం కారును అప్పగించారు.
అయితే, తన అనుమతి లేకుండానే వర్క్‌షాప్ సిబ్బంది ఇంజిన్‌ను తెరిచారని.. ఆ తర్వాత ఇంజిన్‌ను మార్చాల్సి ఉంటుందని.. రూ.4.82లక్షలు డిమాండ్ చేసినట్లుగా కారు యజమాని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను వర్క్‌షాప్ తిరస్కరించింది. ఇంజిన్ తెరవడానికి యజమాని అనుమతి తీసుకున్నామని స్పష్టం చేసింది. మరమ్మతుల అంచనా వ్యయం పలుసార్లు మారగా.. చివరకు రూ.9.91లక్షలుగా నిర్ణజ్ఞించారు. వారంటీ అంశంపై యజమాని, వర్క్‌షాప్ మధ్య విభేదాలు తలెత్తాయి. కారు కేవలం 23వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని.. ఎక్స్‌టెండెడ్ వారంటీ 80వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని, ఉచితంగానే చేసి ఇవ్వాలని వాదించారు. సమస్య తలెత్తే సమయానికి వారంటీ గడువు ముగిసిపోయిందని కంపెనీ, సర్వీస్ సెంటర్ వాదించాయి. ఈ విషయంలో అనేకసార్లు సంపద్రించినా కారును రిపేర్ చేసి ఇవ్వలేదంటూ లీగల్ నోటీసు పంపినా కార్‌ను అప్పగించలేదని ఆరోపించారు. ఖర్చుపై స్పష్టత లేకపోవడం, అంచనాలు మారుతూ రావడంతో వివాదం మరింత ముదిరింది. ఫలితంగా కారు సంవత్సరాల తరబడి వర్క్‌షాప్‌లోనే ఉండిపోయింది.
ఈ వ్యవహారాన్ని విచారించిన ఈస్ట్ చంపారన్ జిల్లా వినియోగదారుల కమిషన్.. నిస్సాన్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, వర్క్‌షాప్‌లోనే లోపం జరిగిందని తేల్చింది. వాహనం తక్కువ దూరమే ప్రయాణించిన ఎనిమిదేళ్ల పాటు వర్క్‌షాప్‌లో ఉండడం ఏమాత్రం సమంజసం కాదని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంతకాలం వర్క్‌షాప్‌లో నిలిచిపోయిన వాహనం మళ్లీ రోడెక్కేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీంతో మరమ్మతులు చేయాలని ఆదేశించడం కంటే పరిహారం చెల్లించడమే సముచితమని నిర్ణయించింది. కారు కొనుగోలు ధర రూ.10,82,181ను బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. అలాగే, 2018 సెప్టెంబర్ 1 నుంచి చెల్లింపు జరిగే తేదీ వరకు వార్షిక 7 శాతం సాధారణ వడ్డీ చెల్లించాలని చెప్పింది. న్యాయపరమైన ఖర్చుల కోసం అదనంగా రూ.25వేల పరిహారం ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. మొత్తం చెల్లించేందుకు రెండు నెలలు గడువు ఇచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జూన్ 20, 2026

Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ టెస్ట్..
జూన్ 20, 2026

Indira Mahila Shakti | మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం : మంత్రి మహ్మద్ అజారుద్దీన్
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు
- ●RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్



