త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balmoori Venkat | తేజ‌స్వీ సూర్య‌ను తెలంగాణ‌కు రానివ్వం.. వ‌స్తే మా ఆవేశం చూపిస్తం

Balmoori Venkat | రాష్ట్ర‌ ఏర్పాటును అవమానించేలా పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యాను తెలంగాణ‌కు రానివ్వ‌మ‌ని.. వ‌స్తే మా ఆవేశ‌మేంటో చూపిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బ‌ల్మూరి వెంక‌ట్ హెచ్చ‌రించారు. సూర్య మాటలను బీజేపీ నేతలు ఇప్పటివరకు కూడా ఖండించలేదన్నారు.

S

Telangana | Published On Jun 20, 2026, 4.53 pm IST

Balmoori Venkat | తేజ‌స్వీ సూర్య‌ను తెలంగాణ‌కు రానివ్వం.. వ‌స్తే మా ఆవేశం చూపిస్తం
Advertisement
  • మీటింగ్ పెట్టాల‌నుకుంటే ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
  • బీజేపీకి సమాధానం ఎలా చెప్పాలో జెన్ జీ కి బాగా తెలుసు
  • ప్రభుత్వ విప్ బ‌ల్మూరి వెంక‌ట్ హెచ్చ‌రిక‌

Balmoori Venkat | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌ ఏర్పాటును అవమానించేలా పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యాను తెలంగాణ‌కు రానివ్వ‌మ‌ని.. వ‌స్తే మా ఆవేశ‌మేంటో చూపిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బ‌ల్మూరి వెంక‌ట్ హెచ్చ‌రించారు. ఒక‌వేళ ఇక్క‌డ మీటింగ్ పెట్టాల‌నుకుంటే ముందు భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సూర్య మాటలను బీజేపీ నేతలు ఇప్పటివరకు కూడా ఖండించలేదన్నారు. శ‌నివారం పార్టీ నాయ‌కుల‌తో కలిసి గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడారు. బీజేపీకి ఎలా బుద్ధి చెప్పాలో జెన్ జీకి బాగా తెలుస‌న్నారు.

న‌మో జెన్ జీ కాంక్లేవ్ మీటింగ్‌కు వ‌స్తే అడ్డుకుంటం..

పార్లమెంట్‌లో ఆనాడు తేజస్వీ సూర్యా మాటలను ఖండించలేని బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. క్షమాపణ చెప్పకుండా నమో జెన్ జీ కాంక్లేవ్ పేరుతో హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టి, సూర్య హాజరైతే తప్పకుండా అడ్డుకుంటాం. మీటింగ్ పెట్టాలనుకుంటే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ అస్థిత్వాన్ని, సెంటిమెంట్‌ను ఎగతాళి చేసి మాట్లాడిన సూర్య తెలంగాణకు వస్తే ఆవేశంతో ఉన్న యువకుల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను ఎవరు కించ‌ప‌రిచినా ఊరుకునేది లేదు అని బ‌ల్మూరి తీవ్రంగా హెచ్చరించారు.

జెన్ జీ యూత్‌తో సదస్సులు హాస్యాస్పదం.. 

తెలంగాణ అంటేనే భావోద్వేగం, సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. దేశంలో పేపర్ లీకులు చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ తెలంగాణలో జెన్ జీ యూత్‌తో సదస్సులు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ కుట్రలకు బలవుతున్న జెన్ జీ యువతనే బీజేపీ పాలకులపై పోరాటం చేస్తోంది. అలాంటి బీజేపీకి ఎలాంటి సమాధానం చెప్పాలో జెన్ జీ యువతకు బాగా తెలుసు. ఇప్పటికే పోరాటాన్ని ఉధృతం చేశారు. మోడీ ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రజల చేతుల్లో శిక్ష అనుభవించక తప్పదు అని బ‌ల్మూరి వెంక‌ట్‌ ఫైర‌య్యారు.

Advertisement
Advertisement