Donald Trump | ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది.. హర్మూజ్ తెరుచుకుంది: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభం వైపు నడిపించిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి అమెరికా (US Iran War) ముగింపు పలికింది. ఇరాన్‌తో (Iran) శాంతి ఒప్పందం కుదిరిందని (Peace Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
International | Published On Jun 15, 2026, 6.33 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్: ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభం వైపు నడిపించిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి అమెరికా (US Iran War) ముగింపు పలికింది. ఇరాన్‌తో (Iran) శాంతి ఒప్పందం కుదిరిందని (Peace Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇక ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తక్షణమే పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఎలాంటి సుంకాలు లేకుండానే
ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ తెరుచుకుంటుందని వెల్లడించారు. `ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా చమురు రవాణా చేయండి’ అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇరాన్‌తో కుదిరిన ఈ శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విజయవంతమైందని పేర్కొన్న ట్రంప్, ఇందులో భాగస్వాములైన అన్ని పక్షాలకు అభినందనలు తెలిపారు.
స్పందించని ఇరాన్
`ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఇప్పుడే పూర్తయింది. అందరికీ నా అభినందనలు! హర్ముజ్ జలసంధి గుండా ఎలాంటి సుంకాలు లేకుండా ఓడల రాకపోకలను నేను పూర్తిగా అనుమతిస్తున్నాను. అదే సమయంలో ఇరాన్‌పై ఉన్న యూఎస్ నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేయడానికి ఆదేశాలు ఇస్తున్నా. ప్రపంచ దేశాల ఓడలారా.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. చమురు ప్రవాహాన్ని రానివ్వండి!` అని ట్రంప్ పోస్టు చేశారు. అయితే.. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ ఇప్పటికీ స్పందించలేదు. మరోవైపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

తాజావార్తలు
- ●Cabinet Sub-Committee | ఎగుమతి రకాలపై రైతులకు అవగాహన కల్పించాలి
- ●Trisha | జననాయగన్ డైరెక్టర్‌తో త్రిష మూవీ - షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్
- ●Ashok Gehlot | ఇందిర బతికుండి ఉంటే బీజేపీని ఎప్పుడో నిషేధించేవారు.. అశోక్ గహ్లోత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ●Co-Living Trend in Hyderabad | హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో 'కో-లివింగ్' ఫీవర్: లగ్జరీ లైఫ్ స్టైలా లేక 'సహజీవనం' ట్రెండా?
- ●Child Marriages | బాల్య వివాహాలపై రాష్ట్రవ్యాప్త పోరు.. తరుణి సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం..
- ●Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం

Cabinet Sub-Committee | ఎగుమతి రకాలపై రైతులకు అవగాహన కల్పించాలి

Trisha | జననాయగన్ డైరెక్టర్‌తో త్రిష మూవీ - షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్

Ashok Gehlot | ఇందిర బతికుండి ఉంటే బీజేపీని ఎప్పుడో నిషేధించేవారు.. అశోక్ గహ్లోత్ వివాదాస్పద వ్యాఖ్యలు

Co-Living Trend in Hyderabad | హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో 'కో-లివింగ్' ఫీవర్: లగ్జరీ లైఫ్ స్టైలా లేక 'సహజీవనం' ట్రెండా?






