Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు
Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోందని.. ఆ రాజ్యం స్థాపించడనాకి వ్యూహాలు పన్నుతోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తులు యూనివర్సిటీలో దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
- ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడుతున్నరు
- 90 శాతం సంపద బీజేపీ నేతల అనునయుల చేతుల్లోనే ఉంది
- ఆర్ఎస్ఎస్ వ్యక్తులు యూనివర్సిటీలో దూరి భ్రష్టు పట్టిస్తున్నరు
- టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు
త్రినేత్ర.న్యూస్: బీజేపీ గాడ్సే జపం చేస్తోందని.. ఆ రాజ్యం స్థాపించడనాకి వ్యూహాలు పన్నుతోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శాశ్వతంగా అధికారంలో ఉండడానికి వారు ఎంత దూరమైనా వెళ్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తులు యూనివర్సిటీలో దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించిన ఆర్‌వోను ఉరి తీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అనేలా..
రఘుపతి రాజారాం పేరును బీజేపీ మరిచిపోయింది. గాడ్సే రాజ్యం స్థాపించాలని వ్యూహం పన్నుతున్నారు. గాడ్సేను ఆరాధించే వ్యక్తులు పాలి. సొంత ఎజెండాను తీసుకొచ్చి జనాలపై రుద్దుతున్నారు. బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. 90 శాతం సంపద బీజేపీ నేతల అనునయుల చేతిలో ఉంది అని పేర్కొన్నారు.
ఆర్వోను ఉరి తీసినా తప్పు లేదు..
చైనా చొచ్చుకొస్తా ఉంది. ఈ విషయం మాట్లాడారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫొటోలతో సహా చూపించారు. గాంధీ కుటుంబం త్యాగమూర్తుల కుటుంబం. నెహ్రూ, గాంధీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. లక్షల కోట్ల ఈశాన్య రాష్ట్రాల సంపద దోచి పెడుతున్నారు. మీనాక్షి విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేసు లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన ఆర్ఓని ఉరి తీసినా తప్పు లేదు. జార్ఖండ్‌లో అంబానీ తరపు వ్యక్తికి సరైన పత్రాలు లేకున్నా మరోసారి అవకాశం ఇచ్చారు అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు.
దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా?
దేవుడు పేరు చెప్పకుండా బీజేపీ నేతలు గెలిచే దమ్ముందా? ఉదయం లేస్తే దేవుడి పేరు జపం చేస్తారు. పవన్‌ను బూచీగా చూపెట్టి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. లౌకిక వాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది అని టీపీసీసీ రాష్ట్ర చీఫ్ ఆరోపించారు.

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష..
అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మహేశ్‌కుమార్‌గౌడ్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వీరితో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జూన్ 20, 2026

Samantha | సమంత తల్లి కాబోతుందా? – మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
జూన్ 20, 2026

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!
- ●Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్
- ●Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!



