Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్..
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే జట్టుతో కలిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఫైనల్‌లో గాయపడ్డ విరాట్.. అఫ్ఘానిస్తాన్‌తో స్వదేశంతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విరాట్.. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది.
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే జట్టుతో కలిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఫైనల్‌లో గాయపడ్డ విరాట్.. అఫ్ఘానిస్తాన్‌తో స్వదేశంతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విరాట్.. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం టెస్టుల కోసం ఈ నెల 22న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు వెళ్లున్నట్లు తెలుస్తోంది. జులై 14 నుంచి 19 వరకు ఇంగ్లండ్ వేదిక జరిగే వన్డే సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్‌ను వైద్యబృందం సమగ్రంగా అంచనా వేయనుంది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో సీఓఈ వైద్య బృందం ఇప్పటికే రన్ మెషిన్‌ను పరీక్షించి.. రిహాబిలిటేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు అందించింది. ఈ క్రమంలోనే ఈ నెల 22న మరోసారి టెస్టులు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసిన సందర్భంగా విరాట్ ఫిట్‌నెస్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ స్పందించారు. “ఐపీఎల్ ఫైనల్‌లో గాయపడినప్పటి నుంచి ఇంకా వారం కూడా కాలేదు. ప్రస్తుతం ఫుల్ టైమ్‌టేబుల్ మా వద్దలేదు. ఇంగ్లండ్ వన్డే సిరీస్ నాటికి కోహ్లీ ఫిట్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఫిజియో నుంచి పూర్తి నివేదిక ఇంకా అందలేదు” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 616 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగిన మూడు వన్డే సిరీస్‌ల్లో వరుసగా ఐదు సార్లు 50కిపైగా స్కోర్లు సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లీ అందుబాటులోకి వస్తే టీమిండియాకు భారీ ఊరట కలుగనున్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు
- ●Combination Drugs | 16 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం.. వెంటనే అమలు..
- ●Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ
- ●Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో - ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- ●Cantonment Land Scam | కంటోన్మెంట్లో రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్.. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు
- ●Indira Mahila Shakti | మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం : మంత్రి మహ్మద్ అజారుద్దీన్

Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు

Combination Drugs | 16 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం.. వెంటనే అమలు..

Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో - ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు






