Donald Trump | ఎనిమిది యుద్ధాలు ఆపా.. నోబెల్ నాకే దక్కాల్సింది : ట్రంప్
Donald Trump | తన జోక్యం వల్లే భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కూడా తనకే రావాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
International | Published On Jul 9, 2026, 4.56 pm IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : భారత్-పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరు మారడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. అదే సమయంలో తనకు నోబెల్ బహుమతి (Nobel Peace Prize) దక్కాల్సిందని వ్యాఖ్యానించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. గతేడాది భారత్-పాక్ మధ్య భీకర యుద్ధం నెలకొందని చెప్పారు. వారం రోజులుగా సాగిన ఈ యుద్ధంలో 11 విమానాలు కూలిపోయాయన్నారు (11 aircraft were shot down). రెండు దేశాల మధ్య ఘర్షణలు అణు యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉండటంతో తాను జోక్యం చేసుకున్నట్లు వివరించారు. సుంకాలతో బెదిరించడంతో రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధాన్ని ఆపేశాయంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని ట్రంప్ ప్రకటించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి కూడా తనకే రావాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ అలా జరగలేదని నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ మొదట్నుంచీ ఖండిస్తూనే ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాను వెళ్లిన ప్రతీ చోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు.
Also Read..
ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో మూడు రోజుల పాటు భారీ పర్పుల్ డే సేల్
నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో మూడు రోజుల పాటు భారీ పర్పుల్ డే సేల్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagadish Reddy Birthday | లండన్‌లో ఘనంగా మాజీ మంత్రి బర్త్‌డే.. 'జై జగదీశ్ అన్న' నినాదాలతో హోరెత్తిన వేడుకలు
- ●Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్నది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్
- ●CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ●Etela Rajender vs Bandi Sanjay | బండి, ఈటల మధ్య సయోధ్య..! ఇకనైనా కలిసి పని చేసేనా..?
- ●Food Safety Telangana | తెలంగాణలో ఫుడ్ అడల్టరేషన్పై ఉక్కుపాదం: కల్తీ చేస్తే ఇక క్రిమినల్ కేసులే.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Jagadish Reddy Birthday | లండన్‌లో ఘనంగా మాజీ మంత్రి బర్త్‌డే.. 'జై జగదీశ్ అన్న' నినాదాలతో హోరెత్తిన వేడుకలు

Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్నది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు

Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి






