Donald Trump | లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) భారీ ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపులు, పరువు నష్టం కలిగించిన కేసులో ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్‌కు 5.8 మిలియన్ డాలర్ల (రూ.47 కోట్లు) పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
International | Published On Jul 9, 2026, 12.08 pm IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll)పై లైంగిక వేధింపులు, పరువు నష్టం కలిగించిన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు (America federal court) డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. ట్రంప్ దోషిగా తేలిన ఈ కేసులో కారోల్‌కు 5.8 మిలియన్ డాలర్ల (రూ.47 కోట్లు) పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
1990లో మాన్‌హట్టన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేశారు. కారోల్ ఆరోపణలపై 2023లో విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ.. ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అయితే, ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని తేల్చింది. ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చిన జ్యూరీ.. కారోల్‌కు పరిహారం కింద 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే, అధ్యక్షుడు చేసిన అప్పీల్‌ను విచారించడానికి గత వారం అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఫెడరల్ కోర్టు ఆ మొత్తాన్ని వెంటనే కారోల్‌కు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
Also Read..
దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. షాకింగ్ వీడియో
లెనిన్ సెన్సార్ రివ్యూ - అఖిల్, భాగ్యశ్రీ రొమాన్స్ హైలైట్ - ఆ ట్విస్ట్ మాత్రం షాకింగ్...
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






