త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే సాంకేతిక లోపం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

Emergency Landing | హైద‌రాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ (Shamshabad Airport) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కార‌ణంగా విజయవాడ వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమ‌ర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) అయింది.

G

Hyderabad | Published On Sep 30, 2026, 10.53 am IST

Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే సాంకేతిక లోపం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌
Advertisement

Emergency Landing | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ (Shamshabad Airport) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కార‌ణంగా విజయవాడ వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమ‌ర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) అయింది. ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బుధవారం ఉదయం 591 ఎయిర్‌లైన్స్‌ విమానం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు (Vijayawada) బయల్దేరింది. టేకాఫ్‌ అయిన తర్వాత కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక (Technical Issue) సమస్యను గుర్తించిన పైల‌ట్‌.. వెంట‌నే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు (ఏటీసీ) సమాచారం అందించారు. దీంతో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమ‌తించ‌డంతో.. శంషాబాద్‌లోనే సుర‌క్షితంగా ల్యాండింగ్‌ చేశారు. ఆ స‌మ‌యంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్న‌ది. వారిని ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటుచేసుకోక‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, సాంకేతిక లోపానికి సంబంధించిన పూర్తి వివరాలు, విమానం తిరిగి ఎప్పుడు విజయవాడకు బయలుదేరుతుందన్న అంశంపై సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement