త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic IPO | ఆంథ్రోపిక్ ఐపీఓకు భారీ డిమాండ్.. ఆరు రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్.. తేదీ ఎప్పుడంటే..?

Anthropic IPO | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ తీసుకురానున్న ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే సుమారు ఆరు రెట్లు అధికంగా కొనుగోలు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువ గరిష్ఠంగా 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

S

Business | Published On Nov 13, 2026, 5.36 pm IST

Anthropic IPO | ఆంథ్రోపిక్ ఐపీఓకు భారీ డిమాండ్.. ఆరు రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్.. తేదీ ఎప్పుడంటే..?
Advertisement

Anthropic IPO | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ తీసుకురానున్న ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే సుమారు ఆరు రెట్లు అధికంగా కొనుగోలు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువ గరిష్ఠంగా 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

కొత్త వారికి చాన్స్ లేదా..?

ఆంథ్రోపిక్ సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రపంచ స్టాక్ మార్కెట్‌లో కీలక చర్చనీయాంశంగా మారింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ వెల్లడించిన నివేదిక ప్రకారం, కంపెనీ విక్రయానికి ఉంచిన షేర్లకు అందుబాటులో ఉన్న పరిమాణం కంటే ఆరు రెట్లు అధికంగా కొనుగోలు ఆర్డర్లు వచ్చాయి. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆశించిన స్థాయిలో షేర్లు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లు భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

ఒక్కో షేర్ ధ‌ర 78 డాల‌ర్లు..?

ఆంథ్రోపిక్ ఐపీఓ ద్వారా కంపెనీ విలువ గరిష్ఠంగా 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంద‌ని అంచనా. క్లాడ్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తన ఐపీఓలో భాగంగా 825 మిలియన్ షేర్లను ఒక్కో షేరుకు 70 నుంచి 78 డాలర్ల ధరతో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విక్రయం ద్వారా గరిష్ఠంగా 64.4 బిలియన్ డాలర్లు సమీకరించాలని యోచిస్తోంది. కృత్రిమ మేధ రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో, ఆంథ్రోపిక్ ఐపీఓకు లభిస్తున్న స్పందన వాల్‌స్ట్రీట్‌లో ఏఐ రంగంపై ఇన్వెస్టర్ల విశ్వాసానికి కీలక పరీక్షగా నిలవనుంది.

నవంబర్ 19న నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆంథ్రోపిక్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏఎన్‌టీ (ఏఎన్టీ) ట్రేడింగ్ చిహ్నంతో షేర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. అయితే ఐపీఓకు సంబంధించిన వివరాలు, షేర్లకు వచ్చిన డిమాండ్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు ఆంథ్రోపిక్ సంస్థ వెంటనే అందుబాటులోకి రాలేదని రాయిటర్స్ వెల్లడించింది.

Advertisement
Advertisement