Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
Trump Gold Card | అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే సంపన్న విదేశీయుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 'గోల్డ్ కార్డ్' మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కార్డుకు సంబంధించిన చిత్రం తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కెన్ చాంగ్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
International | Published On Nov 15, 2026, 1.55 pm IST
Trump Gold Card | అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే సంపన్న విదేశీయుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 'గోల్డ్ కార్డ్' మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కార్డుకు సంబంధించిన చిత్రం తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కెన్ చాంగ్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా జెండా, అధ్యక్షుడు ట్రంప్ పేరు, అధికారిక చిహ్నాలతో కూడిన గోల్డ్ కార్డ్ రూపం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది కేవలం ఓ ప్రత్యేక గుర్తింపు కార్డు మాత్రమే కాదు. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరికాలో శాశ్వత నివాస హోదా పొందేందుకు ఉద్దేశించిన ఇమ్మిగ్రేషన్ ప్రొగ్రామ్ ఇది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వారు 10 లక్షల డాలర్లు (సుమారు రూ.8.9 కోట్లు) కట్టాలి. అదనంగా 15 వేల డాలర్ల (సుమారు రూ.13 లక్షలు) నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గోల్డ్ కార్డ్ అంటే?
ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ స్కీమ్‌ని ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ 10న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అమెరికాకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చగల సంపన్న విదేశీయులను ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఉద్యోగం, పెట్టుబడి ఆధారంగా గ్రీన్‌కార్డు పొందే మార్గాలకు భిన్నంగా.. భారీ ఆర్థిక విరాళం ఆధారంగా వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను అందిస్తోంది.
ఎవరెవరు అర్హులు?
- గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు కొన్ని కీలక అర్హతలు కలిగి ఉండాలి.
- అమెరికాలో చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదా పొందేందుకు అర్హులై ఉండాలి.
- అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశానికి అనుమతించదగిన వ్యక్తి అయి ఉండాలి.
- సంబంధిత ఇమ్మిగ్రెంట్ వీసా అందుబాటులో ఉండాలి.
- అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్వహించే సమగ్ర తనిఖీల్లో పాస్ కావాల్సి ఉంటుంది.
- వ్యక్తిగత దరఖాస్తుదారులు 15 వేల డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- భద్రతా తనిఖీల అనంతరం ఆమోదం లభిస్తే 10 లక్షల డాలర్ల విరాళాన్ని చెల్లించాలి
అర్హతలు, అందుబాటులో ఉన్న వీసాల ఆధారంగా దరఖాస్తుదారులకు EB-1, EB-2 కేటగిరీల కింద శాశ్వత రెసిడెంట్ హోదా కల్పిస్తారు. కాబట్టి డబ్బు చెల్లించినంత మాత్రాన గ్రీన్‌కార్డు ఖాయమని మాత్రం అనుకోవద్దు.
కుటుంబ సభ్యులకూ వర్తింపు
గోల్డ్ కార్డు పొందిన వ్యక్తితో పాటు జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు అవివాహిత పిల్లలు కూడా అమెరికాకు వెళ్లవచ్చు. అయితే వీరిని ప్రారంభ దరఖాస్తులోనే చేర్చాలి. ప్రతి కుటుంబ సభ్యుడికీ అదనంగా 15 వేల డాలర్ల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు 10 లక్షల డాలర్ల విరాళం చెల్లించాల్సి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది.
కంపెనీల కోసం కార్పొరేట్ గోల్డ్ కార్డ్
వ్యక్తిగత దరఖాస్తుదారులకే కాకుండా విదేశీ ఉద్యోగులను అమెరికాలో కొనసాగించాలనుకునే కంపెనీలకూ ప్రత్యేక అవకాశం కల్పించారు. దీనినే కార్పొరేట్ గోల్డ్ కార్డ్‌గా పిలుస్తున్నారు.
- ఒక్కో ఉద్యోగి కోసం కంపెనీ 20 లక్షల డాలర్ల విరాళం చెల్లించాలి.
- ఒక్కో ఉద్యోగికి 15 వేల డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు అదనం.
- కార్పొరేట్ గోల్డ్ కార్డుపై ఏటా ఒక శాతం నిర్వహణ రుసుము ఉంటుంది.
- ఒక ఉద్యోగి స్థానంలో మరో ఉద్యోగిని స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది.
- బదిలీ చేసేటప్పుడు ఐదు శాతం ట్రాన్స్‌ఫర్ ఫీజు చెల్లించాలి.
పన్నుల విషయంలో కీలక విషయం
గోల్డ్ కార్డు పొందిన వారు అమెరికా శాశ్వత నివాసితులుగా పరిగణిస్తారు. అందువల్ల అమెరికా పౌరులు, ఇతర శాశ్వత నివాసితుల మాదిరిగానే అమెరికా పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై కూడా అమెరికా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని దరఖాస్తుదారులు ముందుగానే పరిగణనలోకి తీసుకోవాలి. గోల్డ్ కార్డుతో పాటు 'ట్రంప్ ప్లాటినం కార్డ్' పేరుతో మరో పథకాన్ని కూడా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.44.5 కోట్ల) విరాళం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఏడాదిలో గరిష్టంగా 270 రోజుల పాటు అమెరికాలో ఉండే అవకాశం కల్పించనున్నారు. అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై అమెరికా పన్ను నుంచి మినహాయింపు కల్పించడం దీని ప్రత్యేకత. అయితే ఈ ప్లాటినం కార్డు కోసం ప్రస్తుతం పేర్లు నమోదు చేసే ప్రక్రియ నడుస్తోంది.
I’m happy to announce that I’m the first Malaysian to receive the Trump Gold Card! Finally a permanent resident of the USA 🇺🇸🗽 https://t.co/bO8UHHRIZE
— ken (@kenchangh) November 15, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం
- ●Sachin Tendulkar | ఆ బ్యాట్ ఇప్పటికీ నాతోనే ఉంది.. చిన్ననాటి ఫొటోతో సచిన్ ఎమోషనల్ పోస్ట్!
- ●Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..
- ●Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ●Special Trains | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆరు సర్వీసులు పొడిగింపు..
- ●SIR | సర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్.. ఫామ్-6పై ఈసీ క్లారిటీ!

KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

Sachin Tendulkar | ఆ బ్యాట్ ఇప్పటికీ నాతోనే ఉంది.. చిన్ననాటి ఫొటోతో సచిన్ ఎమోషనల్ పోస్ట్!

Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..

Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు




