త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హ‌ర్మూజ్‌ను తెరిచే ప్ర‌స‌క్తే లేదు.. అలా చేస్తే విధ్వంస‌మే.. ట్రంప్ డెడ్‌లైన్‌కు ఇరాన్ కౌంట‌ర్‌

Strait of Hormuz | ఇరాన్‌ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ చేప‌ట్టిన యుద్ధం 38వ రోజుకు చేరింది. ఈ నేప‌థ్యంలో దాడులు, ప్ర‌తిదాడుల‌తో ప‌శ్చిమాసియా మొత్తం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది.

D

International | Published On Apr 6, 2026, 12.22 pm IST

Strait of Hormuz | హ‌ర్మూజ్‌ను తెరిచే ప్ర‌స‌క్తే లేదు.. అలా చేస్తే విధ్వంస‌మే.. ట్రంప్ డెడ్‌లైన్‌కు ఇరాన్ కౌంట‌ర్‌
Advertisement

Strait of Hormuz | ఇరాన్‌ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ చేప‌ట్టిన యుద్ధం 38వ రోజుకు చేరింది. ఈ నేప‌థ్యంలో దాడులు, ప్ర‌తిదాడుల‌తో ప‌శ్చిమాసియా మొత్తం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు ఆశాకాన్నంటాయి. ఈ నేప‌థ్యంలో ఇంధ‌న స‌ర‌ఫరాకు అత్యంత వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) తెరిపించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ జ‌ల‌సంధి విష‌యంలో టెహ్రాన్‌కు విధించిన గ‌డువును ట్రంప్ మ‌రోసారి పొడిగించారు. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ స‌మ‌యం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ జ‌ల‌సంధిని వెంట‌నే తెరవ‌క‌పోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల‌పై బాంబుల‌తో దాడులు చేస్తామంటూ హెచ్చ‌రించారు.

విధ్వంస‌మే..

అయితే, ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌కు టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. జ‌ల‌సంధిని తెరిచే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది. యుద్ధం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టానికి పూర్తిగా ప‌రిహారం చెల్లించే వ‌ర‌కూ ఈ జ‌ల‌సంధి మూసివేసే ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు, మౌలిక వ‌స‌తుల‌పై దాడి చేస్తామ‌న్న ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చింది. అదే జ‌రిగితే త‌గిన విధంగా ప్ర‌తిస్పందిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. "అమెరికాకు సంబంధించిన ఏ మౌలిక వసతులైనా మా లక్ష్యంగా మారతాయి" అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ హెచ్చరించారు. "పౌర లక్ష్యాలపై దాడులు చేస్తే.. విధ్వంసకరమే. మా దాడి, ప్ర‌తీకార చ‌ర్య‌లు మ‌రింత విధ్వంస‌క‌రంగా, విస్తృతంగా ఉంటాయి అని ఇరాన్ హెచ్చ‌రించింది.

34 మంది మృతి..

మ‌రోవైపు ఇరాన్‌పై అమెరికా దాడుల‌ను తీవ్ర‌త‌రం చేసింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున టెహ్రాన్‌లోని ప్ర‌భుత్వ భ‌వ‌నాలే ల‌క్షంగా యూఎస్‌-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. క్షిప‌ణుల‌తో విరుచుకుప‌డ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఇరాన్ మీడియా నివేదించింది. టెహ్రాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు చిన్నారులు స‌హా 23 మంది మృతి చెంద‌గా.. టెహ్రాన్‌కు ద‌క్షిణాన ఉన్న ఖోమ్ న‌గ‌రంలోని ఓ నివాస ప్రాంతంలో ఐదుగురు మ‌ర‌ణించారు. దక్షిణాన ఉన్న బందర్-ఎ లెంగే నగరంలో ఆరు మర‌ణాలు న‌మోద‌య్యాయి. అంతేకాదు, అనేమంది గాయ‌ప‌డిన‌ట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.

Also Read..

రూ. 1,270 కోట్ల ప్ర‌భుత్వ‌ కాంట్రాక్టులు.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూ కుటుంబ సంస్థ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన సుప్రీంకోర్టు

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. గ్లోబల్ చమురు ధరలపై ప్రభావం.. 110 డాల‌ర్లు దాటిన బ్రెంట్‌

వ‌చ్చే నెల 1 నుంచి అమ‌ల్లోకి గిగ్ వ‌ర్క‌ర్ల చ‌ట్టం..

Advertisement
Advertisement