త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude oil | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. గ్లోబల్ చమురు ధరలపై ప్రభావం.. 110 డాల‌ర్లు దాటిన బ్రెంట్‌

Crude oil | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు క‌ఠిన హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో మార్కెట్ల‌లో అనిశ్చితి మ‌రింత పెరిగింది. గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా భావించే బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.74శాతం పెరిగి 109.8 డాల‌ర్ల‌కు ఎగిసింది.

P

Business | Published On Apr 6, 2026, 11.11 am IST

Crude oil | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. గ్లోబల్ చమురు ధరలపై ప్రభావం.. 110 డాల‌ర్లు దాటిన బ్రెంట్‌
Advertisement

Crude oil | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు క‌ఠిన హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో మార్కెట్ల‌లో అనిశ్చితి మ‌రింత పెరిగింది. గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా భావించే బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.74శాతం పెరిగి 109.8 డాల‌ర్ల‌కు ఎగిసింది. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 1.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 110.60 డాలర్లకు చేర‌గా.. అమెరికా క్రూడ్ (WTI) ధర 1.8 శాతం పెరిగి 113.60 డాలర్ల వద్ద ముగిసింది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇరాన్‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. హార్ముజ్ జ‌ల‌సంధిని వెంట‌నే తెరువ‌క‌పోతే ఇరాన్ ఇంధ‌న స్థావ‌రాల‌పై దాడులు జ‌ర‌గ‌వ‌చ్చంటూ హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైతే అమెరికా క‌ఠిన‌మైన సైనిక చ‌ర్య‌ల‌కు దిగుతుందంటూ సంకేతాలిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగానే స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జలసంధిని తెరవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పూర్తిగా పరిహారం లభించే వరకు ఆ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ ఉన్నతాధికారి తేల్చి చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఒమ‌న్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఒమాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు ఆదివారం ఇరాన్ అధికారులతో భేటీ అయి వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించే మార్గాలపై చర్చలు జరిపినట్లు తెలిపింది.

మ‌రో వైపు గ్లోబల్ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు ఒపెన్ ప్ల‌స్ దేశాలు క్రూడ్ ఉత్ప‌త్తిని పెంచేందుకు నిర్ణ‌యించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యూఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమాన్ దేశాలు కలిసి 2026 మే నుంచి రోజుకు 2.06 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించాయి. సౌదీ అరేబియా, రష్యా చెరో 62 వేల బ్యారెల్స్‌, ఇరాక్ 26వేలు, యూఏఈ 18వేలు, కువైట్ 16వేలు, కజకిస్తాన్ ప‌దివేలు, అల్జీరియా ఆరువేలు, ఒమాన్ 5వేల బ్యారెల్స్ ముడి చ‌మురును అద‌నంగా ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. మార్కెట్ స్థిర‌త్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఉత్ప‌త్తిలో మార్పులు ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఒపెక్ ప్ల‌స్ దేశాలు వెల్ల‌డించాయి.

హార్ముజ్ జలసంధి దీర్ఘకాలం మూసివేస్తే ప్రపంచ సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ ఒత్తిడిని కొంత మేర తగ్గించేందుకు ఒపెక్ ప్ల‌స్ దేశాలు ఉత్పత్తి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement