Assembly Session | దావోస్‌లో 44 కంపెనీలతో ఎంవోయూలు.. 6 కంపెనీలకు భూ కేటాయింపులు
Assembly Session | గత రెండేండ్లలో దావోస్ (Davos) పర్యటనల్లో భాగంగా రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. 44 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నదని, ఇప్పటివరకు 6 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయన్నారు
Assembly Session | త్రినేత్ర.న్యూస్: గత రెండేండ్లలో దావోస్ (Davos) పర్యటనల్లో భాగంగా రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. 44 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నదని, ఇప్పటివరకు 6 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయని, మరో 3 కంపెనీలకు కేటాయించేందుకు భూములను గుర్తించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2024, 2025లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో (WEF Summit) పాల్గొన్న విషయం తెలిసిందే. దావోస్ పెట్టుబడులపై ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్, ధన్ పాల్ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో (Assembly Session) సమాధానం చెప్పారు.
`దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు ప్రభుత్వం కుదుర్చుకుందని, పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. 2024 దావోస్‌లో 18 ఎంవోయూలు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 2025లో 26 ఎంవోయూలు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూముల గుర్తింపు జరిగింది` అని తెలిపారు. నిజామాబాద్‌లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ నిర్మించామన్న మంత్రి, ఐటీ టవర్‌లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అందులో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
https://x.com/TeluguScribe/status/2037038250595147981
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



