US Military | ఇరాన్‌తో వార్.. రూ.931 కోట్ల విలువైన తమ విమానాన్ని స్వయంగా పేల్చేసిన అమెరికా.. ఎందుకంటే..?
US Military | పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులను పెంచాయి. అదే సమయంలో శత్రుదాడులను టెహ్రాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇక ఈ వార్‌లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
International | Published On Apr 6, 2026, 2.45 pm IST
US Military | పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులను పెంచాయి. అదే సమయంలో శత్రుదాడులను టెహ్రాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇక ఈ వార్‌లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా మిలిటరీ (US Military) స్వయంగా బాంబులతో పేల్చేసింది. సుమారు 100 మిలియన్ డాలర్లు.. అంటే రూ.931 కోట్ల విలువైన ఆ విమానాన్ని యూఎస్ ధ్వంసం చేసింది. అత్యంత ఖరీదైన విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇంతటి విలువైన ఈ విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో అమెరికా ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఇటీవలే అమెరికా ఫైటర్ జెట్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన విషయం తెలిసిందే. రెండు యుద్ధవిమానాలను టెహ్రాన్ కూల్చివేసింది. మరో రెండు హెలికాప్టర్ల (Helicopters)పై కూడా దాడి జరిగింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు (Pilots) సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యాడు. కూలిపోయిన విమానం F-15E Strike Eagle గా గుర్తించారు. ఆ విమానం పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక ఆపరేషన్ నిర్వహించింది.
ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్లిన విమానాల్లో ఒకటి సాంకేతిక లోపంతో ఇరాన్ ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి. అదే సమయంలో ఆ విమానానికి సమీపంలోకి ఇరాన్ సేనలు వస్తుండటంతో అమెరికా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. విమానం శత్రు దేశానికి చిక్కితే.. తమ సైనిక రహస్యాలు బయటపడతాయని భావించిన అగ్రరాజ్యం రూ.931 కోట్ల విలువైన ఆ విమానాన్ని బాంబులతో స్వయంగా పేల్చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరాన్ విడుదల చేసింది. ఈ ఘటన 1980లో జరిగిన ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ వైఫల్యాన్ని గుర్తుచేస్తోంది.
అప్పుడేం జరిగిందంటే..
1979లో ఇరాన్ విప్లవం తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విద్యార్థులు 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకున్నారు. వారిని రక్షించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆదేశాలతో యూఎస్ సైన్యం 1980 ఏప్రిల్ 24న 'ఆపరేషన్ ఈగిల్ క్లా' పేరుతో రహస్య సైనిక చర్య చేపట్టింది. అత్యాధునిక హెలికాప్టర్లు, ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలతో ఈ మిషన్ ప్రారంభమైంది. అయితే, అనూహ్యంగా ఇరాన్ ఎడారిలో ఎదురైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆపరేషన్ ఘోరంగా విఫలమైంది. సుమారు 8 మంది సైనికులను అమెరికా కోల్పోవాల్సి వచ్చింది.
ఇసుక తుఫానులు, సాంకేతిక లోపాల వల్ల ఈ ఆపరేషన్ మధ్యలోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంలో ఒక EC-130 విమానం, RH-53 హెలికాప్టర్ పరస్పరం ఢీకొనడంతో పేలుడు సంభవించి ఎనిమిది మంది అమెరికా సైనికులు మరణించారు. అప్పుడు కూడా అమెరికా తన RH-53D హెలికాప్టర్లను ఇరాన్ ఎడారిలో వదిలివేసింది. అప్పటి నుంచి తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలిరావడంతో అమెరికా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా అమెరికా జాగ్రత్త పడింది. పైలట్ కోసం చేపట్టిన సీక్రెట్ మిషన్‌లో విఫలమైన విమానాన్ని బాంబులతో పేల్చేసింది.
Also Read..
టోల్‌ప్లాజాలా వద్ద "నో క్యాష్".. ఇకపై మొత్తం డిజిటల్ ప్రయాణమే.. ఎప్పటి నుంచంటే..?
రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి రోజుల్లో ఒక కుటుంబానికి సరిపోతుందా..?
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



