Tv Serial Actress | కోలీవుడ్‌లో విషాదం – ప్రముఖ టీవీ సీరియల్ నటి ఆత్మహత్య
తమిళ సీరియల్ నటి సుభాషిణి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కయల్ సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న సుభాషిణి తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. కుటుంబ విభేదాలే ఆమె ఆత్మహత్యకు కారణమని సమాచారం.
Entertainment | Published On Apr 6, 2026, 2.01 pm IST
Tv Serial Actress | కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి సుభాషణి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కయల్ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది సుభాషిణి. ఈ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో తమిళంతో పాటు మలయాళంలో పలు సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాలు చేసింది. సుభాషిణి హఠాన్మరణంతో తమిళ టీవీ, సినీ వర్గాలు దిగ్భాంతికి లోనయ్యాయి. భర్త బిబిన్‌తో కలిసి చెన్నై అయ్యప్పన్ తంగల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది సుభాషిణి. ఆమె ఆత్మహత్యకు కుటుంబ విభేదాలే కారణమని సమాచారం. చనిపోవడానికి ముందు భర్తతో వీడియో కాల్‌లో ఆమె గొడవపడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుభాషిణి మరణం పట్ల సహచర నటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంకలో పుట్టి....
శ్రీలంకలో పుట్టి పెరిగిన సుభాషిణి ఇండియాలో సెటిలైంది. అనుప రణసింహ పేరుతో శ్రీలంకలో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత తన పేరును సుభాషిణి బాలసుబ్రమణియమ్‌గా మార్చుకుంది. యార్ అలైపాదు, హిమ్ హియర్ ఆఫ్టర్‌తో పాటు తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది.సుభాషిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువగా భర్తతో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



