Health Insurance | రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి రోజుల్లో ఒక కుటుంబానికి సరిపోతుందా..?
Health Insurance | దేశంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సదుపాయాలు లభించకపోవడంతో చాలా మంది ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణ చికిత్స వరకు ఫర్వాలేదు. కానీ ఏదైనా జబ్బు చేసి ప్రైవేటు హాస్పిటల్‌లో చేరితే బిల్లు తడిసి మోపెడు అవుతుంది.
Health Insurance | దేశంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సదుపాయాలు లభించకపోవడంతో చాలా మంది ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణ చికిత్స వరకు ఫర్వాలేదు. కానీ ఏదైనా జబ్బు చేసి ప్రైవేటు హాస్పిటల్‌లో చేరితే బిల్లు తడిసి మోపెడు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేదే హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే మొత్తం క్యాష్ లెస్ విధానంలోనే చికిత్సకు అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అందుకనే ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ లను చాలా మంది తీసుకుంటున్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్‌లను సహజంగానే చాలా మంది రూ.10 లక్షలకు తీసుకుంటుంటారు. ఫ్యామిలీ గ్రూప్ ప్లాన్ కింద ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇంట్లోని యజమాని, భార్య, పిల్లలకు వర్తించేలా ఈ ఇన్సూరెన్స్ పాలసీలను అనేక కంపెనీలు ఇస్తున్నాయి. అయితే దేశంలో నానాటికీ పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా సగటున ఒక భారతీయుడికి ఏడాదికి రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అసలు సరిపోదని, ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఖర్చు అధికంగా ఉంటుంది కనుక ఆ మొత్తం చాలదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా 12 శాతం కవరేజ్ పెరిగేలా..
మెట్రో నగరాల్లో హార్ట్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, కిడ్నీ వ్యాధి చికిత్సలు వంటి తీవ్రమైన వ్యాధులతో హాస్పిటల్‌లో చేరితే ఇన్సూరెన్స్ రూ.10 లక్షలు సరిపోదు. దీంతో కుటుంబంపై ఆర్థిక భారం పడుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచి తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని, దీని వల్ల అనుకోని భారీ ఖర్చులు వచ్చినా తట్టుకుంటారని, కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఏయాన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ నివేదిక ప్రకారం దేశంలో వైద్య ద్రవ్యోల్బణం ఏడాదికి 12 నుంచి 13 శాతం వరకు పెరుగుతుందని తేలింది. ఎప్పటికప్పుడు హాస్పిటల్ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఏడాదికి కనీసం 12 శాతం వరకు ఇన్సూరెన్స్ మొత్తం పెరిగేలా పాలసీలను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
రూ.10 లక్షల కవరేజ్ సరిపోతుందా..
ఇదే విషయంపై ఇండస్ ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేష్ జైన్ మాట్లాడుతూ నేటి తరుణంలో రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే బేసిక్ అని, మెట్రో నగరాల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇది చాలా తక్కువ మొత్తమని అన్నారు. పాలసీదారులు ఇన్సూరెన్స్ కవరేజ్‌తోపాటు సూపర్ టాప్-అప్ ప్లాన్లను తీసుకోవడం మంచిదని సూచించారు. వయస్సు, నగరం, జీవనశైలి ఆధారిత ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏదైనా తీవ్రమైన వ్యాధికి చికిత్స చేయించుకుంటే హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షలకు పైనే అవుతుందని, అందువల్ల రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలా చేయడం మంచిది..
పాలసీదారులు కనీసం రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండే ప్లాన్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి తోడు అదనంగా రైడర్, సూపర్ టాప్-అప్ ప్లాన్లను ఎంచుకోవాలని, ఇవి ఇన్సూరెన్స్ కవరేజ్ ను పూర్తిగా వాడుకున్నాక యాక్టివేట్ అవుతాయని, దీంతో అత్యవసర వైద్య ఖర్చులకు కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని చెబుతున్నారు. మెట్రో నగరాల్లో రోబోటిక్ సర్జరీలు, హాస్పిటల్ రూమ్ చార్జిలు, ఆధునిక పరీక్షలు ఎక్కువగా ఖర్చవుతాయి. కనుక పాలసీ కవరేజ్ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఇక కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే పాలసీల్లో హాస్పిటల్ ఖర్చులను పూర్తిగా భరించరు. 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే కంపెనీ భరించేలా పాలసీలను ఇస్తారు. ఈ విషయం ముందుగా పాలసీదారులకు తెలియదు. దీంతో ఆ తరువాత హాస్పిటల్‌లో బిల్లు చేయించే సమయంలో అసలు విషయం తెలుసుకుని ఇబ్బందులు పడతారు. కనుక ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు పాలసీదారులు పాలసీ తీసుకునే సమయంలోనే పూర్తిగా దాని వివరాలను తెలుసుకోవాలి. దీని వల్ల తరువాతి రోజుల్లో పాలసీ క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






