US Aircraft Crash | అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. ఇరాక్‌లో కుప్పకూలిన సైనిక విమానం
US Aircraft Crash | ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ (US Aircraft Crash) తగిలింది. యూఎస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది.
International | Published On Mar 13, 2026, 9.02 am IST
US Aircraft Crash | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ (US Aircraft Crash) తగిలింది. యూఎస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది. పశ్చిమ ఇరాక్‌లో (Iraq) ఈ ఘటన చోటుచేసుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించిన తర్వాత పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన విమానాలు కూలిపోవడం (Aircraft Crash) ఇది నాలుగోసారి. అయితే ఈ విమానం ఎవరి దాడుల్లోనూ కూలిపోలేదని యూఎస్ ఆర్మీ స్పష్టం చేసింది.
అసలేమైందంటే..
సైనిక చర్యల్లో భాగంగా రెండు కేసీ-135 ఇంధన ట్యాంకర్ విమానాలు గాలిలోకి ఎగిరాయి. వాటిలో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. రెండో విమానం సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. అయితే, ఈ విమానం శత్రువుల కాల్పుల వల్ల కూలిపోలేదని పశ్చిమాసియాలో అమెరిక బలగాలకు బాధ్యతవహిస్తున్న యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది.
అయితే ఈ విమానాన్ని తామే కూల్చామని ఇరాక్‌లో ఇరాన్ మద్దతున్న రెసిస్టెన్స్ గ్రూప్ (Iraq's Resistance Groups) ప్రకటించింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ని క్షిపణితో కూల్చివేశామని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ వార్తలను అమెరికా కొట్టివేసింది. అది ప్రమాదవశాత్తు కూలిపోయిందని చెప్పింది.
కేసీ-135 విమానం గత 60 ఏండ్లుగా సేవలు అందిస్తున్నది. సాధారణంగా అందులో ముగ్గురు సిబ్బంది ఉంటరు. ఇద్దరు పైలట్లు, మరొకరు మరో విమానానికి ఇంధనం నింపేందుకు ఉపయోగించే పరికరాలను నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని కే-135 విమానాల్లో ఒక న్యావిగేటర్‌తోపాటు 37 మంది వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది.
నాలుగో విమానం..
ఇక, ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇప్పటికే మూడు విమానాలను కోల్పోయింది. మూడు ఎఫ్-15ఈ యుద్ధవిమానాలు కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో కూలిపోయాయి. తాజాగా మరొకటి కూలిపోవడం గమనార్హం.
https://x.com/CENTCOM/status/2032115048340988255
ఇవికూడా చదవండి..
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..
నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని : రేవంత్ రెడ్డి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






