త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hormuz Crisis | హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు

Hormuz Crisis | స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇకపై యుద్ధానికి ముందు ఉన్న ప‌రిస్థితుల్లోకి తిరిగి వెళ్లే అవ‌కాశం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

P

International | Published On Jun 23, 2026, 9.58 am IST

Hormuz Crisis | హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు
Advertisement

Hormuz Crisis | స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇకపై యుద్ధానికి ముందు ఉన్న ప‌రిస్థితుల్లోకి తిరిగి వెళ్లే అవ‌కాశం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని ఇకపై ఇరాన్ తన సొంత విధానాలు, భద్రతా ఏర్పాట్ల ప్రకారం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. అయితే, అంతర్జాతీయ నిబంధనలను మాత్రం పాటిస్తామని కూడా స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఘాలిబాఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

స్విట్జర్లాండ్‌లో అమెరికాతో జరిగిన సాంకేతిక స్థాయి చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. ఆ చర్చల్లో ఇరాన్ తన స్థైర్యాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. అంతేకాదు, ఇరాన్ ఒత్తిడి కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టును సవరించాల్సి వచ్చిందన్నారు. లెబనాన్‌లో హెజ్బొల్లా సహా మిత్రుల‌కు మద్దతు నిలిపివేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ మార్పు జరిగిందని చెప్పారు. ఇది ఇరాన్ దౌత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాపై విశ్వాసం ఉంచ‌డం సాధ్యం కాదని ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. “మేము గతంలోనూ అమెరికాను నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు, భవిష్యత్తులోనూ నమ్మం” అని ఆయన స్పష్టం చేశారు.

లెబనాన్ చర్చల్లో ఇరాన్ పాల్గొనకపోతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి, ముస్లిం, షియా సమాజాల మధ్య రక్తపాతం పెరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్చల వల్ల ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అంతర్గత ఐక్యతపై కూడా ఘాలిబాఫ్ దృష్టి సారించారు. సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో దేశం మొత్తం ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఖమేనీ నిర్ణయాలే తుది నిర్ణయాలుగా భావించాలని ఆయన స్పష్టం చేశారు. చర్చల ఫలితంగా ఇరాన్‌కు నిలిచిపోయిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, చమురు ఆంక్షలు కొంతమేర సడలించబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న 14 అంశాల ఒప్పందం (MoU) ప్రకారం ఈ చర్చలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాలు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, అలాగే 60 రోజుల్లో తుది ఒప్పందానికి చేరుకునే రోడ్‌మ్యాప్‌పై ముందుకు వెళ్తున్నాయిజ‌.

Advertisement
Advertisement