Dasoju Sravan | రాహుల్‌ను ప్రధాని చేసే సీన్ రేవంత్ రెడ్డికి ఉందా..? : ఎమ్మెల్సీ దాసోజు
Dasoju Sravan | కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ‘చేసే’ అంత సీన్ అసలు రేవంత్ రెడ్డికి ఉందా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ‘చేసే’ అంత సీన్ అసలు రేవంత్ రెడ్డికి ఉందా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని భారత ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసే లేదా సిఫార్సు చేసే అధికారం తనకే ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు.. ఆయన రాజకీయ అహంకారాన్ని, అక్రమంగా సంపాదించిన ఆస్తితో వచ్చిన బలుపును బయటపెడుతోంది అని ధ్వజమెత్తారు.
ఈ రకంగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా.. భారతదేశ ప్రధానిని కూడా 'తయారు చేసే' స్థాయికి తన ధనబలం, అంగబలం, రాజకీయ యంత్రాంగం పెరిగిపోయాయని రేవంత్ రెడ్డి ఒక భ్రమను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నవ్వాలో, ఏడవాలో అర్థం కాని ఒక రాజకీయ హాస్యాస్పదం. రాహుల్ గాంధీ నాయకత్వం దేశవ్యాప్తంగా జరిగిన ప్రజా పోరాటాల ద్వారా, ముఖ్యంగా ‘భారత్ జోడో యాత్ర’ వంటి చారిత్రాత్మక ఉద్యమాల ద్వారా పుట్టుకొచ్చింది. మెడ నిండా క్రిమినల్ కేసులు ఉండి, చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడే ఒక అవినీతి ముఖ్యమంత్రి ఇచ్చే సర్టిఫికెట్ రాహుల్ గాంధీకి అవసరం ఉందా? అని నిలదీశారు.
అంతేకాకుండా, ఇటువంటి బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా.. రాహుల్ గాంధీ ప్రధాని పదవి కోసం పోరాడటానికి వెనకాడుతున్నారని, ఆయనను ఎవరో ఒప్పించాల్సి వస్తోందనే తప్పుడు చిత్రీకరణకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇలాంటి డ్రామాలు భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని కించపరచడమే కాకుండా, సీరియస్ రాజకీయాలను రేవంత్ రెడ్డి తన సొంత డబ్బా కోసం వాడుకుంటున్నట్టుగా మారుస్తున్నాయని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



