Kishan Reddy | రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులిచ్చే పరిస్థితే లేదు.. వెయ్యి కోట్ల పార్టీ ఫండ్ ఎలా ఇస్తరు: కిషన్ రెడ్డి
Kishan Reddy | ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారన్నది వాళ్ల ఇష్టమని చెప్పారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారన్నది వాళ్ల ఇష్టమని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న విషయమై కిషన్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. దేశ వ్యాప్తంగా ఆపరేషన్ ఖాగర్ కొనసాగుతుందని వెల్లడించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ బ్రాండ్ కోసం, కేసీఆర్.. రేవంత్ రెడ్డి బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు కేంద్రం చేసిన పనులపై లెక్కలతో సహా లేఖ రాశానని, దానిపై ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నేత స్పందించలేదన్నారు. తెలంగాణలో లంకె బిందలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. రూ.1000 కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి ఎలా ఇవ్వాలి అనుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడ నుంచి సమకూరుతుందో నిగ్గు తేల్చాలన్నారు. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలు తప్పితే మరొకటి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లకు అనుమతులు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు ఖాళీ చేయమనడం వెనక మతలబు ఏందని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్ల బాపు ఘాట్, రూ. లక్ష యాభై వేల కోట్ల మూసీ రివర్ ప్రక్షాళన వెనక కమిషన్లు ఎంత అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



