త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHM Recruitment | రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఎలాంటి ప‌రీక్ష లేకుండానే..

NHM Recruitment | రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీలగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

G

Telangana | Published On Oct 24, 2026, 5.57 am IST

NHM Recruitment | రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఎలాంటి ప‌రీక్ష లేకుండానే..
Advertisement

NHM Recruitment | త్రినేత్ర న్యూస్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీలగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం 35 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల (NHM Recruitment) చేసింది. ఇందులో ఫిజియోథెరపిస్ట్, ఎంఎల్‌హెచ్‌పీ, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్, ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఏఎన్‌ఎం వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హ‌త ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.26,410. నుంచి రూ.40,000 జీతం వ‌స్తుంది.

మొత్తం ఖాళీలు- 35

  • ఫిజియోథెరపిస్ట్- 1
  • ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌ఓ, ఎంఓ (పల్లె దవాఖాన)- 9
  • ఫార్మాసిస్ట్- 3
  • స్టాఫ్ నర్స్- 11
  • ల్యాబ్ టెక్నీషియన్- 3
  • ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్- 1
  • ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్- 1
  • ఆప్టోమెట్రిస్ట్- 1
  • ఏఎన్‌ఎం- 5

అర్హత: సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 44 ఏడ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏండ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏండ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వ‌యోప‌రిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు 90 శాతం వెయిటేజీ, వయసు ఆధారంగా ఇచ్చే 10 మార్కులతో కలిపి మొత్తం 100 మార్కులకు మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
అప్లికేష‌న్ ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా..
ఆఫీసెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (డీఎంహెఓ)
ఐడీఓసీ, రాజన్న సిరిసిల్ల జిల్లా,
తెలంగాణ.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 30
ప్రొవిజ‌న్ మెరిట్ లిస్ట్‌: న‌వంబ‌ర్ 11
కౌన్సెలింగ్‌: న‌వంబ‌ర్ 18

వెబ్‌సైట్‌: https://rajannasircilla.telangana.gov.in/notice_category/recruitment/

Advertisement
Advertisement